క్రెడిట్ కార్డ్ ద్వారా ప్రతి కొనుగోలుపై సంపాదించే రివార్డ్ పాయింట్లు అదనపు ప్రయోజనాలు మాత్రమే కాదు, తెలివిగా ఉపయోగిస్తే అవి మీకు మంచి సేవింగ్స్ ఇంకా సౌకర్యాలను అందిస్తాయి. క్రెడిట్ కార్డ్ ద్వారా ఏదైనా కొనేటప్పుడు మీరు పొందే పాయింట్లను రివార్డ్ పాయింట్లు అంటారు. ప్రీమియం అండ్ కో-బ్రాండెడ్ కార్డులు సాధారణంగా ఎక్కువ పాయింట్లను ఇస్తాయి. కానీ ప్రశ్న ఏమిటంటే ఈ పాయింట్లను మీరు ఎక్కువ ప్రయోజనం పొందేలా ఎలా రీడీమ్ చేసుకోవాలి ? అయితే ఈ విధంగా మీరు వాటిని రీడీమ్ చేసుకోవచ్చు.

1. విమాన, హోటల్ బుకింగ్‌లు: రివార్డ్ పాయింట్ల ద్వారా ట్రావెల్ ఖర్చులు తగ్గించుకోవచ్చు. చాలా క్రెడిట్ కార్డులు ట్రావెల్ అగ్రిగేటర్లతో డీల్ చేసుకుంటాయి. దీనివల్ల విమాన టిక్కెట్లు, హోటల్ బుకింగ్‌లపై పాయింట్లకు ఎక్కువ వాల్యూ లభిస్తుంది. అంతర్జాతీయ బుకింగ్‌లు లేదా బిజినెస్ క్లాస్ టిక్కెట్లకు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, ICICI బ్యాంక్ iShop పోర్టల్‌లో ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్ కార్డ్‌తో హోటల్ బుకింగ్‌లపై 36% వరకు రివార్డులను పొందవచ్చు.
2. ఈ-కామర్స్, రిటైల్ పార్ట్నర్షిప్ : చాల క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఈ-కామర్స్, ఫ్యాషన్ బ్రాండ్‌లు, గ్రోసరీ, ఎలక్ట్రానిక్స్ రిటైలర్‌లతో ఒప్పందాలు చేసుకుంటాయి. ఈ ఒప్పందం షాపింగ్ చేసేటప్పుడు పాయింట్‌లను వోచర్‌లు లేదా డిస్కౌంట్‌ల రూపంలో రీడీమ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు HDFC బ్యాంక్ SmartBuy ద్వారా Apple ఉత్పత్తులు లేదా రూ.1 విలువైన Tanishq వోచర్‌లపై 1 రివార్డ్ పాయింట్ పొందవచ్చు.
3. క్యాష్‌బ్యాక్: మీరు ఇన్స్టంట్ సేవింగ్స్ కోరుకుంటే రివార్డ్ పాయింట్‌లను క్యాష్‌బ్యాక్‌గా రీడీమ్ చేసుకోవచ్చు. అయితే, దీని వాల్యూ తక్కువగా ఉండవచ్చు (ఉదాహరణకు 1 రివార్డ్ పాయింట్ = రూ.0.30). అయినా సరే, చిన్న ఖర్చులను తగ్గించుకోవడానికి ఇదోక సులభమైన మార్గం.
4. ఉత్పత్తులు, గిఫ్ట్ వోచర్లు: చాలా క్రెడిట్ కార్డులు రివార్డ్స్ కేటలాగ్‌లో ఆభరణాలు, వంటగది ఉపకరణాలు, ఎలక్ట్రానిక్స్ లేదా గిఫ్ట్ వోచర్‌ల వంటి ఉత్పత్తులను అందిస్తాయి. ఉదాహరణకు Axis బ్యాంక్ నియో కార్డు EDGE రివార్డ్స్ కేటలాగ్‌లో Amazon, Zomato లేదా Blinkit వోచర్‌తో రీడీమ్ చేసుకోవచ్చు.
5. ఎయిర్‌మైల్స్ కన్వర్షన్: మీరు ఎక్కువగా విమానంలో ప్రయాణిస్తుంటే రివార్డ్ పాయింట్‌లను ఎయిర్‌మైల్స్‌గా మార్చుకోవచ్చు. చాలా కార్డులు 1 రివార్డ్ పాయింట్ = 1 ఎయిర్‌మైల్ రేటుతో ఎక్స్చేంజ్ ఉంటాయి. ఇది తరచుగా ప్రయాణించే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
6. ఇంధనం, భోజనం: కొన్ని కార్డులు ఇంధనం లేదా భోజనంపై రివార్డ్ పాయింట్‌లను రీడీమ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఉదాహరణకు, HDFC డైనర్స్ క్లబ్ బ్లాక్ కార్డ్ వీకెండ్ డైనింగ్ పై 2X రివార్డ్ పాయింట్‌లను, Swiggy Dineoutలో 25% సేవింగ్స్ అందిస్తుంది.
7. EMI : మీరు పెద్ద మొత్తంలో ఏదైనా కొనుగోలు చేసి ఉంటే రివార్డ్ పాయింట్‌లను ఉపయోగించి దాన్ని EMIగా మార్చుకోవచ్చు. యాక్సిస్ బ్యాంక్ నియో కార్డు రూ.2500 కంటే ఎక్కువ ట్రాన్సక్షన్స్ పై EMIగా మార్చుకునే సదుపాయాన్ని అందిస్తుంది. ఈ పద్ధతి పెద్ద ఖర్చులను అడ్జస్ట్ చేయడంలో సహాయపడుతుంది.
8. ప్రయాణ బీమా, లాంజ్ యాక్సెస్: కొన్ని కార్డులు ప్రయాణ బీమా లేదా విమానాశ్రయ లాంజ్ యాక్సెస్ కోసం రివార్డ్ పాయింట్‌లను రీడీమ్ చేసుకునే అవకాశాన్ని అందిస్తాయి. ఉదాహరణకు HDFC ఇన్ఫినియా కార్డ్ ఆన్ లిమిటెడ్ లాంజ్ యాక్సెస్, రూ.50 లక్షల వరకు అత్యవసర విదేశీ ఆసుపత్రి కవర్‌ను అందిస్తుంది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications