CRED News: కొత్త వ్యాపారంలోకి క్రెడ్.. ఆ కంపెనీ కొనుగోలుకు యత్నం..
CRED News: దేశీయ ఫిన్ టెక్ స్టార్టప్ కంపెనీ క్రెడ్ శరవేగంగా తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించే యాప్ రూపంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కంపెనీ లాభదాయకత కోసం ఇతర సర్వీసులను చేర్చుకుంటూ పోతోంది.
ఈ క్రమంలోనే మ్యూచువల్ ఫండ్ స్టార్టప్ కంపెనీ Kuveraను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోందని వెల్లడైంది. ప్రస్తుతం కువేర మార్కెట్ విలువ 1.4 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది పెట్టుబడిదారుల నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోకుండా తన సేవలను అందించటంతో పెట్టుబడిదారుల నుంచి మంచి కస్టమర్ బేస్ సంపాదించుకుంది.

కేవలం మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే కాక కంపెనీ విసృతమైన పెట్టుబడి అవకాశాలను అందిస్తోంది. అమెరికా స్టాక్స్ లో పెట్టుబడులు, ఫిక్స్‌డ్ డిపాజిట్, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు వంటి వివిధ సేవలను ఒకే గొడుగు కింద అందిస్తోంది. క్రెడ్ కొనుగోలు నిర్ణయం దేశంలో ప్రజల నుంచి పెరుగుతున్న మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల వల్ల వచ్చినట్లు నిపుణులు భావిస్తున్నారు. కువేర ప్రస్తుతం 575 బిలియన్ డాలర్ల అసెట్స్ నిర్వహిస్తోంది. ఇది గత ఏడాది కంటే 20 శాతం అధికం.
ఈ వృద్ధి ఉన్నప్పటికీ ఆర్థిక ఉత్పత్తులను కొనుగోలు చేసే భారతీయ వినియోగదారుల సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలుస్తోంది. అందువల్ల ఈ రంగంలో క్రెడ్ వంటి కంపెనీలు భవిష్యత్తు వృద్ధిని భారీగా ఆశిస్తున్నాయి. ప్రస్తుతం క్రెడ్ దేశంలో మొత్తం క్రెడిట్ కార్డ్ చెల్లింపుల్లో మూడింట ఒక వంతు వాల్యూమ్‌ను ప్రాసెస్ చేస్తోంది. గతంలో కంపెనీ బెంగళూరుకు చెందిన స్టార్టప్ స్మాల్‌కేస్‌తో కొనుగోలు చర్చలు నిర్వహించింది. అదే సమయంలో LiquiLoans, CredAvenueలో పెట్టుబడి పెట్టింది. అలాగే HapPayని కొనుగోలు చేసింది.


Click it and Unblock the Notifications