క్రెడిట్ కార్డ్ వినియోగదారులు అధిక సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ కలిగి ఉన్నట్లయితే అది సదరు వ్యక్తి క్రెడిట్ వర్దీనెస్ ను సూచిస్తుంది. ఇలాంటి వారికి ఫైనాన్స్ కంపెనీలు త్వరగా లోన్స్ మంజూరు చేసేందుకు ముందుకొస్తుంటాయి. అయితే తక్కువ క్రెడిట్ స్కోర్ ఉండే వ్యక్తులను ప్రమాదకర రుణగ్రహీతగా చేస్తుంది. ఇది లోన్స్ కోసం వారు చేసే ప్రయత్నాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. CIBIL స్కోర్ వ్యక్తుల క్రెడిట్ చరిత్రపై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ స్కోర్‌ను పెంచడానికి క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించుకోవటం ఒక మంచి పద్ధతి.

పెరుగుతున్న క్రెడిట్ కార్డ్ వినియోగం..
స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాలను లేదా అవసరాలను తీర్చుకోవటానికి క్రెడిట్ కార్డులు ఒక సాధనంగా మారాయి. మార్చి 2022 నాటికి RBI విడుదల చేసిన డేటా ప్రకారం.. నెలకు డెబిట్ కార్డ్ పై రూ.700 ఖర్చులతో పోలిస్తే క్రెడిట్ కార్డ్ వినియోగదారులు సగటున నెలకు రూ.14,500 ఖర్చు చేస్తున్నట్లు తేలింది. అంటే క్రెడిట్ కార్డును ప్రజలు ఏ స్థాయిలో వినియోగిస్తున్నారో ఈ గణాంకాల ద్వారా మనం అర్ధం చేసుకోవచ్చు. పైగా ఇది చాలా మందికి బిల్లింగ్ విషయంలోనూ వెసులుబాటును కల్పిస్తోంది.

క్రెడిట్ కార్డులో లాభాలతో పాటు లోపాలు..
క్రెడిట్ కార్డ్ దాని ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ.. కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు.. వినియోగదారులు క్రెడిట్ కార్డ్ పూర్తి లిమిట్ లో కేవలం 30 శాతం వరకు వినియోగించటం మంచిది. లేకుంటే అది వినియోగదారుడు ఎక్కువ లోన్స్ పై ఆదారపడటాన్ని సూచిస్తుంది. ఈ కారణంగా వారి CIBIL స్కోర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

స్కోర్‌ని పెంచుకునేందుకు క్రెడిట్ కార్డ్‌ని ఎలా ఉపయోగించాలి?
మంచి CIBIL స్కోర్‌ని పొందడానికి వినియోగదారు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించుకోవటం అనేది ఒక ఉత్తమమైన మార్గంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కార్డ్‌లు కూడా క్రెడిట్ సాధనాలే, వీటిని తెలివిగా అవసరం మేరకు కొన్ని పరిమితులను పాటిస్తూ వినియోగించటం చాలా ఉపయోగకరం. దీని వల్ల వినియోగదారుని క్రెడిట్ ఎక్స్‌పోజర్, మిక్స్‌ను పెంచవచ్చు.

తెలివిగా ఎంచుకోండి:
ప్రత్యేక ఆఫర్‌లు ఉన్న వాటి కోసం వెళ్లడం కంటే వ్యక్తిగత కొనుగోలు అలవాట్లకు బాగా సరిపోయే క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోవడం ఉత్తమం. బ్యాంకులు ప్రత్యేక ఆఫర్‌లను ఇచ్చినప్పుడు.. అవి సాధారణంగా క్రెడిట్ అప్లికేషన్‌కి దారి తీస్తాయి. అందుకోసం సదరు సంస్థ జారీ చేసే వ్యక్తి CIBIL నివేదికపై కఠినమైన విచారణ చేయవలసి ఉంటుంది. కఠినమైన విచారణలు CIBIL స్కోర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఇలాంటి చర్యల వల్ల క్రెడిట్ స్కోర్ కూడా తగ్గుతుంది.

సకాలంలోబిల్లులు చెల్లించండి:
క్రెడిట్ కార్డ్ జారీచేసే సంస్థలు నిర్దిష్ట చెల్లింపు విండోలో కనీస మొత్తం లేదా బకాయి మొత్తాన్ని చెల్లించడానికి అనుమతిస్తాయి. CIBIL స్కోర్‌ను మెరుగుపరచడానికి కనీస మొత్తానికి బదులుగా పూర్తి క్రెడిట్ కార్డ్ బిల్లును చెల్లించడం చాలా ఉత్తమం. పూర్తి క్రెడిట్ కార్డ్ బిల్లులను తిరిగి చెల్లించే వ్యక్తి CIBIL స్కోర్‌ను పెంచుతుంది. పైగా వారికి మంచి రీపేమెంట్ హిస్టరీని నిర్మించటంలో ఎంతగానో తోర్పడుతుంది.

పాత కార్డ్‌లను వినియోగించండి:
వ్యక్తి బిల్లులను పూర్తిగా, సమయానికి చెల్లించగలిగినంత కాలం అతను లేదా ఆమె పాత క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించడం కొనసాగించవచ్చు. పాత కార్డ్‌లు వ్యక్తికి సుదీర్ఘమైన క్రెడిట్ హిస్టరీని అందిస్తాయి. అది CIBIL స్కోర్‌పై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల కొత్త క్రెడిట్ కార్డు రాగానే పాత వాటిని క్లోజ్ చేయటం లేదా వినియోగించటం మానేయటం లాంటి పనులు చేయకూడదు.

ప్రయాణంలో స్థిరపడకండి:
కొన్నిసార్లు వ్యక్తులు తమ క్రెడిట్ కార్డ్ బాకీని సెటిల్ చేయడానికి స్వీట్ డీల్ కోసం బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. అయితే.. బ్యాంకులు అటువంటి రిక్వెస్టులను స్వీకరించినప్పటికీ.. సెటిల్మెంట్లు క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఇది వ్యక్తి తన బకాయిలను పూర్తిగా చెల్లించలేదని చూపిస్తుంది. వ్యక్తి క్రెడిట్ కార్డ్ కంపెనీతో బాకీని సెటిల్ చేస్తే, స్థితిని 'సెటిల్' నుంచి 'క్లోజ్డ్'కి మార్చడం మంచిది. క్లోజ్డ్ స్టేటస్‌కి మార్చడానికి సదరు వినియోగదారుడు, క్రెడిట్ కార్డ్ కంపెనీ పరస్పరం అంగీకరించాల్సి ఉంటుంది. ఇలా సెటిల్ మెంట్ల కోసం వీలైనంత వరకు వెళ్లక పోవటం మంచిది. ఇలాంటి కొన్ని నియమాలను పాటించటంతో క్రెడిట్ కార్డ్ హోల్డర్ తన సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్ ను క్రమంగా పెంచుకోవచ్చు. మంచి క్రెడిట్ స్కోర్ వల్ల బ్యాంకుల నుంచి అనేక ప్రయోజనాలను ఆక్రర్షనీయమైన రేట్లకే వారు పొందేందుకు అవకాశం ఉంటుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications