ఇల్లు కొంటున్నారా.. ఐతే గుడ్‌న్యూస్, క్రెడాయ్ ఆవాస్ యాప్ లాంచ్
రియాల్టర్స్ అపెక్స్ బాడీ క్రెడాయ్ (Credai) శనివారం సరికొత్త యాప్‌ను లాంచ్ చేసింది. రియల్ ఎస్టేట్ సంస్థలు, హోమ్ బయ్యర్స్‌కు అనుసంధానంగా ఉండే క్రెడాయ్ ఆవాస్ యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా కొనుగోలుకు వీలున్న ఆస్తుల క్రయవిక్రయాలు వేగంగా, సులభంగా జరుగుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.చత్తీస్‌గఢ్ గృహ, పర్యావరణ, రవాణా, అటవీ, న్యాయ శాఖల మంత్రి మహమ్మద్ అక్బర్ రాయ్‌పూర్‌లో దీనిని ఆవిష్కరించారు.
గత నెల నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (NAREDCO) కూడా పూర్తైన ఇళ్ల మార్కెటింగ్ కోసం ఓ ఈ-కామర్స్ వేదికను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు క్రెడాయ్ క్రెడాయ్ ఆవాస్‌ను తీసుకు వచ్చింది. ఈ యాప్ ద్వారా హోమ్ బయ్యర్స్ కొనుగోలు మరింత సులభతరం కానుంది.
ఈ అప్లికేషన్ ద్వారా గృహ కొనుగోలుదారులకు విశ్వసనీయమైన వేదికను అందించడం, వారు ఇష్టపడే ప్రాజెక్టును గుర్తించడం, డెవలపర్‌ను నేరుగా సంప్రదించడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని క్రెడాయ్ తెలిపింది.

కాగా, NAREDCO కూడా హోమ్ బయ్యర్స్ కోసం ఇటీవల ఈ-కామర్స్ వేదిను అందుబాటులోకి తీసుకు వచ్చింది. 2022 నాటికి అందరికీ ఇళ్లు అనే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా అందుబాటులోని ఇళ్ల విక్రయం కోసం కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (Naredco) మొదటిసారి ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ను తీసుకు వచ్చింది.
HousingForAll.Com పేరుతో ఈ వెబ్‌సైట్‌ను లాంచ్ చేసింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా దీనిని ప్రారంభించారు. RERA కింద నమోదైన నమ్మకమైన, భద్రమైన, నాణ్యమైన ఇళ్లను మాత్రమే ఈ వెబ్ సైట్ ద్వారా విక్రయిస్తారు.


Click it and Unblock the Notifications