Creative Graphics: ఈరోజు స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ఉండటంతో చాలా కంపెనీల షేర్లలో ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో గతంలో విజయవంతంగా లిస్ట్ అయిన ఐపీవో ప్రస్తుతం సూపర్ లాభాలను అందిస్తూ పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది క్రియేటివ్ గ్రాఫిక్స్ సొల్యూషన్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. ఈ ఐపీవోపై బెట్టింగ్ వేసి పెట్టుబడులను కొనసాగించిన ఇన్వెస్టర్లు భారీ లాభాలను ఆర్జిస్తున్నారు. నేడు కంపెనీ షేర్లు మళ్లీ అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. విజయవంతంగా లిస్టింగ్ తర్వాత ఐపీవో షేర్లు గత కొన్ని రోజులుగా అప్పర్ సర్క్యూట్‌లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేడు ఎన్ఎస్ఈలో స్టాక్ ధర రూ.224.20గా ఉంది. వాస్తవానికి కంపెనీ ఐపీవో సమయంలో ఒక్కో షేర్ ఇష్యూ ధర రూ.80-85గా ఉంది. రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడి కోసం లాట్ పరిమాణాన్ని 1600 షేర్లుగా కంపెనీ నిర్ణయించగా దీనికోసం రూ.1,36,000 ఇన్వెస్ట్ చేశారు.

లిస్టింగ్ సమయంలో క్రియేటివ్ గ్రాఫిక్స్ ఐపీవో 105 శాతం ప్రీమియంతో రూ.175 స్థాయిలో NSE SMEలో జాబితా చేయబడింది. పేలుడు లిస్టింగ్ తర్వాత కంపెనీ షేర్ల ధర రూ.183.75 స్థాయికి చేరుకున్నాయి. తర్వాత ఈనెల 10న పెట్టుబడిదారులు షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కి దిగగా షేర్ ధర రూ.167.45 స్థాయికి తగ్గింది. అయితే వరుస పతనం తర్వాత షేర్లలో కొనుగోళ్ల కోలాహలం తిరిగి కొనసాగింది.
క్రియేటివ్ గ్రాఫిక్స్ ఐపీవో మార్చి 28 నుంచి ఏప్రిల్ 4 వరకు రిటైల్ పెట్టుబడిదారుల కోసం అందుబాటులో ఉంది. ఈ కాలంలో కంపెనీ షేర్లు ఏకంగా 201 రెట్ల కంటే ఎక్కువ సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది. కంపెనీ ఈ ఐపీవో ద్వారా అప్పట్లో మార్కెట్ల నుంచి రూ.54.40 కోట్లను సమీకరించింది. 2021 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.2.28 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.


Click it and Unblock the Notifications