Creative Graphics IPO: ఉగాధి రోజున మార్కెట్లోకి వచ్చిన ఐపీవో ఇన్వెస్టర్ల సంపదను మెుదటి రోజే రెండింతలు చేసేసింది. దీంతో చాలా మంది పెట్టుబడిదారులు సంతోషంలో ఉన్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది తొలిరోజే మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించిన క్రియేటివ్ గ్రాఫిక్స్ సొల్యూషన్స్ షేర్లు గురించే. పండుగ రోజున మార్కెట్లో కంపెనీ షేర్ల బలమైన లిస్టింగ్ నమోదు చేశాయి. క్రియేటివ్ గ్రాఫిక్స్ సొల్యూషన్స్ షేర్లు 105 శాతం కంటే ఎక్కువ లాభంతో రూ.175 వద్ద మార్కెట్‌లో లిస్ట్ చేయబడ్డాయి. వాస్తవానికి కంపెనీ ఒక్కో షేరును రూ.85 గరిష్ఠ ధరకు ఇష్యూ చేసింది. కంపెనీ షేర్లు తొలిరోజే ఇన్వెస్టర్లను ధనవంతులను చేశాయి.

లిస్టింగ్ రోజునే ఇన్వెస్టర్ల డబ్బు రెట్టింపు చేసిన క్రియేటివ్ గ్రాఫిక్స్ సొల్యూషన్స్ ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం మార్చి 28న తెరచుకుని ఏప్రిల్ 4, 2024న క్లోజ్ అయ్యింది. బలమైన లిస్టింగ్ తర్వాత షేర్లలో తుఫాను పెరుగుదల నమోదైంది. కంపెనీ షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి రూ.183.75కి చేరాయి. ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన స్టాక్ ఇన్వెస్టర్లను తొలిరోజే ఖుషీ చేసింది. ఈ క్రమంలో పెట్టుబడిదారుల నుంచి కంపెనీ రూ.54.40 కోట్లను విజయవంతంగా సమీకరించింది.
క్రియేటివ్ గ్రాఫిక్స్ సొల్యూషన్స్ ఐపీవోలో మొత్తం 201.86 రెట్లు పందాలు జరిగాయి. కంపెనీ IPOలో రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 144.63 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కోటా 472.85 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారుల కోటా 98.79 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఈ క్రమంలో కంపెనీ లాట్ పరిమాణాన్ని 1600 షేర్లుగా నిర్ణయించింది. వాస్తవానికి కంపెనీ 2014లో ప్రారంభించబడింది. కంపెనీ డిజిటల్ ఫ్లెక్సో ప్లేట్లు, సంప్రదాయ ఫ్లెక్సో ప్రింటింగ్ ప్లేట్లు, లెటర్ ప్రెస్ ప్లేట్లు, మెటల్ బ్యాక్ ప్లేట్లు, కోటింగ్ ప్లేట్‌లను తయారీ వ్యాపారంలో ఉంది.


Click it and Unblock the Notifications