స్క్రీన్‌పై కనిపించాలనేది చాలా మంది కోరిక. ఎవరిని సంప్రదించాలో, ఎక్కడ అవకాశం ఉందో తెలియని పరిస్థితి. డైరెక్టర్‌లదీ అదే పరిస్థితి. తన సినిమాలోని పాత్రలకు తగ్గ ఆర్టిస్టులు ఒక్కొసారి దొరకక అయోమయానికి గురవుతారు. ఈ సమస్యకు చక్కటి పరిష్కారంగా 'హైస్టార్' యాప్ వచ్చేసింది. మూవీ మేకర్‌లను - 24 క్రాప్టులకు సంబంధించిన వ్యక్తులను ఒకేచోట కలిపేందుకు 'హైస్టార్' అనే యాప్ గూగుల్ ప్లేస్టోర్ https://bit.ly/343QOWsలో అందుబాటులో ఉంది.
స్క్రీన్‌పై కనిపించాలనుకునే ఆర్టిస్టులు, మోడల్స్, యాంకర్‌లు, సింగర్స్.. ఇలా 24 శాఖలకు సంబంధించి టాలెంట్ ఉన్న కొత్తవారూ, ఇప్పటికే ఈ ఫీల్డ్‌లో ఉన్న వారు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని తమ ప్రొఫైల్ అందులో క్రియేట్ చేసుకుంటే మూవీ మేకర్స్ నుంచి అవకాశాలు అందుకోవచ్చు. hystar.in అనే వెబ్‌సైట్ కూడా అందుబాటులో ఉంది. హైస్టార్ యాప్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకునే సమయంలో మెంబర్‌షిప్ కోసం 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

మరోవైపు మూవీ మేకర్‌లు కూడా ఈ యాప్‌లో తమ ప్రొఫైల్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో డైరెక్టర్‌లు తమ పాత్రలకు తగిన వారిని ఈ యాప్ ద్వారా సెలక్ట్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో ఉండే ఆర్టిస్టుల ప్రొఫైల్‌ను బట్టి, తమ సినిమా పాత్రలకు తగినవారిని డైరెక్టర్లు సెలక్ట్ చేసుకుని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మూవీ మేకర్‌లకు ఆడిషన్స్ ఫ్లాట్‌ఫాంగా ఈ యాప్ ఉపయోగపడుతుందని హైస్టార్ యాప్ నిర్వహకులు తెలిపారు.
టాలెంట్ ఉన్నవారిని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసే ఫ్లాట్‌ఫాంగా వచ్చిన హైస్టార్ యాప్‌లో ఇండియాలోని అన్ని ఇండస్ట్రీల వాళ్లు ప్రొఫైల్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆడిషన్స్ అప్‌డేట్ కూడా ఈ యాప్ ద్వారా పొందవచ్చు. సినీ ఇండస్ట్రీలోకి, టీవీ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వాలనుకునే వారికి, ఇప్పటికే ఉన్నవారికి మంచి సూపర్ ఫ్లాట్‌ఫాంగా హైస్టార్ యాప్‌ను చెప్పుకొచ్చు.


Click it and Unblock the Notifications