ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలంటే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది "బ్యాటరీ ఎంత కాలం పనిచేస్తుంది?" అనే ప్రశ్నే. కొన్ని లక్షల రూపాయలు పెట్టి, నాలుగు ఐదేళ్లకే బ్యాటరీ మార్చాల్సి వస్తుందా? ఇలాంటి ఆందోళనలు చాలా మందికే ఉన్నాయి. కానీ ఇప్పుడు టాటా మోటర్స్ ఓ మంచి నిర్ణయంతో EV మార్కెట్‌లో కొత్త నమ్మకాన్ని నింపింది. EV బ్యాటరీకి 15 సంవత్సరాల వారంటీ ఇవ్వడం ఆశ్చర్యం అనిపించొచ్చు. మరి, ఇది నిజంగా ఎలా పనిచేస్తుంది? ఎవరికి వర్తిస్తుంది? నిజంగా లాభమేనా? తెలుసుకుందాం.

అందరూ ఎదురు చూస్తున్న కర్వ్ EV మరియు నెక్సాన్ EV 45 kWh మోడళ్లకు ఇప్పుడు లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీ అందుబాటులోకి వచ్చింది. అవును, 15 సంవత్సరాల పాటు, ఎన్ని కిలోమీటర్లు అయినా, మీ బ్యాటరీకి భరోసా ఇస్తోంది.
ఇది కేవలం కొత్త వారికేనా..
ఒక సరికొత్త EV కొనుగోలుదారుడు అయితే మీకు ఈ వారంటీ వచ్చిది. కానీ ఇప్పటికే వీటిని కొన్న ఫస్ట్ హ్యాండ్ ఓనర్లకు కూడా ఈ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది టాటా. మామూలుగా ఈ రకమైన స్కీములు ఫ్యూచర్ కొనుగోలుదారులకు మాత్రమే పరిమితమవుతాయి. కానీ ఈసారి టాటా చేస్తున్నదాన్ని చూస్తే, నిజంగా వినియోగదారులపై ఉన్న నమ్మకం స్పష్టంగా తెలుస్తోంది.
వారంటీ డీటైల్స్:
టాటా మోటర్స్ అందిస్తున్న లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీ 15 సంవత్సరాల పాటు వర్తిస్తుంది, ఇది వాహనం కొనుగోలు చేసిన తేదీ నుండి ప్రారంభమవుతుంది. ప్రయాణించే దూరానికి ఎలాంటి పరిమితి లేదు. మీరు రోజూ 200 కిలోమీటర్లు ప్రయాణించినా కూడా ఈ వారంటీ యథాతథంగా వర్తిస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 80 శాతం కన్నా తక్కువగా పడిపోయినప్పుడు, టాటా మోటర్స్ మరమ్మత్తు చేయడం లేదా అవసరమైతే రీప్లేస్ చేయడం వంటి చర్యలు తీసుకుంటుంది. అయితే, ఈ హామీని పొందాలంటే కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది. వాహనాన్ని కచ్చితంగా టాటా అధికారిక సర్వీస్ సెంటర్లలోనే సేవ చేయించాలి, అలాగే కంపెనీ సూచించిన మెయింటెనెన్స్ షెడ్యూల్‌ను తప్పనిసరిగా అనుసరించాలి.
అదనంగా లభించే లాయల్టీ బెనిఫిట్:
ఇప్పటికే టాటా EV వాహనాన్ని కలిగి ఉన్న వినియోగదారులు కొత్తగా కర్వ్ EV మరియు నెక్సాన్ EV 45 కొంటే రూ. 50,000 వరకు లాభం పొందవచ్చు. బ్యాటరీ వారంటీ వలన వాహన రీసేల్ విలువ పెరుగుతుంది, అలాగే 10 ఏళ్లలో రూ. 8-9 లక్షలు సేవింగ్స్ అవుతాయని అంచనా.
నూతన కర్వ్ EV మోడల్ రెండు బ్యాటరీ ఈ ఆప్షన్లతో వస్తోంది:
45 kWh బ్యాటరీ: క్లెయిమ్ రేంజ్ - 502 km
55 kWh బ్యాటరీ: క్లెయిమ్ రేంజ్ - 585 km
అయితే రియల్ వరల్డ్ యూజ్‌లో, సగటు వినియోగదారులు 350 నుంచి 425 km వరకు ప్రయాణించే అవకాశం ఉంది. నెక్సాన్ EV 45 కూడా 489 km క్లెయిమ్డ్ రేంజ్‌తో, 145 hp మోటార్ పవర్, 215 Nm టార్క్‌తో సరికొత్త డ్రైవింగ్ అనుభూతిని అందిస్తోంది.
ఈ చర్యతో టాటా మోటర్స్ కేవలం మార్కెట్ పోటీ కోసం పని చేయడం లేదు. వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకోవాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్తోంది. EVల భవిష్యత్‌లో ఇది ఒక మైలురాయి అని చెప్పడంలో సందేహం లేదు. మీరు EV కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇప్పుడు సరైన సమయం కావచ్చు.


Click it and Unblock the Notifications