Upcoming IPO's: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల కోలాహలం కొనసాగుతోంది. ఐపీవోలు వస్తూనే ఉంటే ఇన్వెస్టర్లు డబ్బు కుమ్మరిస్తూనే ఉన్నారు. భారతీయ స్టాక్ మార్కెట్లలో ఎల్లప్పుడూ చూడని ఐపీవోల లిస్టింగ్ రద్దీ దలాల్ స్ట్రీట్ చూస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు సైతం ఇందులో పాల్గొంటూ లిస్టింగ్ గెయిన్స్ పొందేందుకు భారీగా ప్రయత్నిస్తున్నాయి. రానున్న వారంలో దాదాపు 5 ఐపీవోలు ఇప్పుడు సిద్ధంగా ఇన్వెస్టర్లకు ముందు వస్తున్నాయి.
Northern ARC Capital IPO: నార్తరన్ ఆర్క్ క్యాపిటల్ కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.777 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ.500 కోట్లకు ఫ్రెష్ ఇష్యూ ఉండగా.. మిగిలినది ఆఫర్ ఫర్ సేల్ రూపంలో 1.05 కోట్ల షేర్ల విక్రయం ద్వారా జరగనుంది. లాట్ పరిమాణాన్ని 57 షేర్లుగా కంపెనీ నిర్ణయించగా ప్రైస్ బ్యాండ్ ధరను రూ.249-263గా ఉంచింది. ఇదే క్రమంలో కంపెనీ తన ఉద్యోగుల కోసం 5.90 లక్షల షేర్లను రిజర్వు చేసింది. 2009లో ప్రారంభించబడిన కంపెనీ రిటైల్ లోన్స్ వ్యాపారంలో కొనసాగుతోంది. అయితే సబ్‌స్క్రిప్షన్ కోసం ఐపీవో సెప్టెంబర్ 16 నుంచి 19 వరకు అందుబాటులో ఉండనుంది.

Arkade Developers IPO: కంపెనీ ఐపీవో ద్వారా రూ.410 కోట్లను సమీకరించేందుకు మార్కెట్లలోకి వస్తోంది. పూర్తిగా ఫ్రెష్ ఇష్యూగా ఉన్న కంపెనీ ఇందుకోసం 3.2 కోట్ల షేర్లను విక్రయిస్తోంది. ఈ క్రమంలో కంపెనీ ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.121-128గా నిర్ణయించింది. ఈ క్రమంలో లాట్ పరిమాణాన్ని 110 షేర్లుగా ఉంచగా, రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం రూ.14,080 పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. ఆర్కేడ్ డెవలపర్స్ లిమిటెడ్ అనేది రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కంపెనీ మహారాష్ట్రలోని ముంబైలో హై-ఎండ్, అధునాతన జీవనశైలి రెసిడెన్షియల్ డెవలప్‌మెంట్‌లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. అయితే సబ్‌స్క్రిప్షన్ కోసం ఐపీవో సెప్టెంబర్ 16 నుంచి 19 వరకు అందుబాటులో ఉండనుంది.
Osel Devices IPO: ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.70.66 కోట్లు సమీకరించేందుకు మార్కెట్లోకి వస్తోంది. ఎన్ఎస్ఈలో లిస్టింగ్ కోసం వస్తున్న ఐపీవో షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.155-160గా నిర్ణయించింది. ఈ క్రమంలో లాట్ పరిమాణాన్ని 800 షేర్లుగా ఉంచింది. ఓసెల్ డివైసెస్ లిమిటెడ్ గతంలో ఇన్నోవేటివ్ ఇన్‌ఫ్రాటెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గా పిలువబడేది. 2006లో స్థాపించబడిన కంపెనీ.. వ్యాపార ప్రకటనల మాధ్యమం, బిల్‌బోర్డ్‌లు, కార్పొరేట్ బోర్డ్‌రూమ్‌లు, ప్రెజెంటేషన్‌లు, డిస్‌ప్లే ప్రమోషన్‌లు, కమాండ్ సెంటర్‌ల తయారీదారు. అయితే సబ్‌స్క్రిప్షన్ కోసం ఐపీవో సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు అందుబాటులో ఉండనుంది.
Pelatro IPO: ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.55.98 కోట్లను సమీకరించాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో కంపెనీ తన షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.190-200గా నిర్ణయించింది. అలాగే లాట్ పరిమాణాన్ని 600 షేర్లుగా ఉంచింది. వ్యాపారాలు తమ కస్టమర్ల ప్రవర్తనను ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి కంపెనీ సహాయం చేస్తుంది. మే 31, 2024 నాటికి భారతదేశంతో సహా 30 దేశాల్లోని 38 టెలికాం నెట్‌వర్క్‌లలో కస్టమర్ ఎంగేజ్‌మెంట్ ప్లాట్‌ఫాం అమలు చేయబడింది. కంపెనీ బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలను కూడా లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించింది. అయితే సబ్‌స్క్రిప్షన్ కోసం ఐపీవో సెప్టెంబర్ 16 నుంచి 19 వరకు అందుబాటులో ఉండనుంది.
Paramount Speciality Forgings IPO: ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న ఐపీవో రూ.32.34 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ.28.33 ఫ్రెష్ ఇష్యూ ఉండగా మిగిలిన దానికి 6.8 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయించాలని చూస్తోంది. ఈ క్రమంలో కంపెనీ షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.57-59గా ఉంచింది. అలాగే లాట్ పరిమాణాన్ని 2000 షేర్లుగా ఉంచింది. అయితే సబ్‌స్క్రిప్షన్ కోసం ఐపీవో సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు అందుబాటులో ఉండనుంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications