డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(DGGI) దేశవ్యాప్తంగా పలు క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజీలలో సోదాలు నిర్వహించింది. పలుచోట్ల పన్ను ఎగవేతలను గుర్తించింది. ప్రముఖ క్రిప్టో ఎక్స్చేంజీ భారీ మొత్తంలో పన్ను ఎగవేతకు పాల్పడినట్లుగా గుర్తించారు. రూ.40.5 కోట్ల వరకు పన్ను ఎగవేతకు పాల్పడిందని ఎక్స్చేంజ్ వ్యాపార కార్యకలాపాలపై దర్యాప్తు అనంతరం జీఎస్టీ ముంబై జోన్(ఈస్ట్ కమిషనరేట్ జోన్) అధికారులు తెలిపారు. ఎక్స్చేంజ్ ఎగవేసిన పన్ను, దానిపై వడ్డీ, జరిమానా కలిపి మొత్తం రూ.49.20 కోట్ల నగదును గత నెల 30న రికవరీ చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
సదరు దిగ్గజ క్రిప్టో ఎజెన్సీ భారీగా పన్ను ఎగవేసినట్లు తేలడంతో DGGI దేశంలోని అన్ని క్రిప్టో కరెన్సీ సేవల కంపెనీల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో మరిన్ని పన్ను ఎగవేతలు అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది.

క్రిప్టోలతోపాటు అత్యాధునిక టెక్నాలజీ ఆధారిత సేవలు అయిన నాన్ ఫంగిబుల్ టోకెన్స్, ఆన్‌లైన్ గేమింగ్ ఇంకా ఈ-కామర్స్ కంపెనీల వ్యాపార కార్యకలాపాలపై ముంబై జోన్ సీజీఎస్టీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం క్రిప్టో కరెన్సీ బిల్లు తీసుకువస్తుందనే వార్తల నేపథ్యంలో బిట్ కాయిన్, ఎథేరియం వంటి దిగ్గజ క్రిప్టోలు పతనమైన విషయం తెలిసిందే. దాదాపు అన్ని క్రిప్టోలు క్షీణించాయి. అయితే ఆ తర్వాత కాస్త కోలుకున్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!



Click it and Unblock the Notifications