inflation: కరోనా అనంతర పరిణామాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ దేశాల ఆర్థిక అనిశ్చితి ప్రభావం భారత్ పైనా పడింది. కానీ వాటన్నిటినీ తట్టుకుని మన ఆర్థిక వ్యవస్థ నిలబడగలిగింది. అయితే రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ఠానికి చేరినట్లు తాజాగా నివేదిక విడుదల కావడం ఆందోళన కలిగిస్తోంది. RBI పలు చర్యలు తీసుకుంటున్నా ద్రవ్యోల్బణం కట్టడి కాకపోవడం ఆలోచించాల్సి విషయమే.

సడెన్ పెరుగుదల:
దేశంలో వినియోగదారుల ధరల సూచీ (CPI)కి సంబంధించిన గణాంకాలను స్టాటిస్టిక్స్ శాఖ ఈరోజు విడుదల చేసింది. జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం.. గత మూడు నెలల గరిష్ఠ స్థాయికి పెరిగినట్లు వెల్లడించింది. అక్టోబరులో 6.77, నవంబరులో 5.88, డిసెంబరులో 5.72 శాతంగా ఉన్న CPI.. జనవరిలో 6.52 శాతానికి చేరినట్లు పేర్కొంది.

నలభై నెలలుగా లక్ష్యాన్ని మించే..
గత మానిటరీ పాలసీ కమిటీ సమీక్షలో రిజర్వ్ బ్యాంకు రెపో రేటుకు 25 బేసిస్ పాయింట్లను జోడించి 6.5 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. ఈ పెంపుదల రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడానికి ఓ కారణమని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. 4 శాతానికి కట్టడి చేయడం RBI లక్ష్యం కాగా.. దాదాపు గత 40 నెలలుగా CPI అంతకు మించి నమోదవుతూనే ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అదే దారిలో ఆహార ద్రవ్యోల్బణమూ..
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) విడుదల చేసిన సమాచారం ప్రకారం.. జనవరి 2023లో గ్రామీణ రిటైల్ ద్రవ్యోల్బణం 6.65 శాతంగా ఉంది. అదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో 4.79 శాతంగా నమోదైంది. గతేడాది డిసెంబరులో 4.19 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం జనవరి నాటికి 5.94 శాతానికి పెరిగింది.

కూరగాయలు మినహా..
మరింత లోతుగా పరిశీలిస్తే.. తృణధాన్యాలు సంబంధిత ఉత్పత్తుల్లో ద్రవ్యోల్బణం 16.12 శాతం, గుడ్లు పాలు మాంసం చేపల విషయంలో 6-9 శాతం, సుగంధ ద్రవ్యాల పరంగా 21.09 శాతం మేర పెరిగింది. కూరగాయల్లో మాత్రం 11.7 శాతం క్షీణత నమోదవడం హర్షించదగ్గ పరిణామం. ఇక ఆహారం పానీయాల్లో 6.19 శాతం, దుస్తులు పాదరక్షల్లో 9.08 శాతం, గృహనిర్మాణం రంగంలో 4.62 శాతం మేర రిటైల్ ద్రవ్యోల్బణంలో పెరుగుదల నమోదైనట్లు NSO వెల్లడించింది.

మరోసారి పెంపు తప్పద ?
"రెండు నెలల పాటు 6 శాతం దిగువకు వచ్చిన CPI, తిరిగి పెరగడం RBIకి ఆందోళన కలిగించే అంశం. తృణధాన్యాలతో పాటు ఆహార ధరలు.. ప్రధాన ద్రవ్యోల్బణం పెరుగుదలకు ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ఆహారేతర వర్గాల్లోనూ గత నెలలో ఒత్తిడి కనిపించింది. రుణగ్రహీతల తిరిగి చెల్లింపు సామర్థ్యంపై ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది" అని 'నైట్ ఫ్రాంక్ ఇండియా' రీసెర్చ్ డైరెక్టర్ వివేక్ రాఠి పేర్కొన్నారు. RBI సానుకూల దృక్పథంతో ఉన్న సమయంలో తిరిగి ద్రవ్యోల్బణం పెరిగితే, మరోసారి రెపో రేటు పెంచే అవకాశం ఉందని 'మిల్ వుడ్ కేన్ ఇంటర్నేషనల్' వ్యవస్థాపకులు నిష్ భట్ అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications