దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారతదేశ రిటైల్ ఇన్‌ఫ్లేషన్(Consumer Price Index - CPI Inflation) అక్టోబర్ నెలలో కేవలం 0.25% వద్ద రికార్డు స్థాయికి పడిపోయింది. ఇప్పటివరకూ ఇంత తక్కువ ద్రవ్యోల్బణం ఎప్పుడూ నమోదు కాలేదు. అయితే దీనివల్ల ఇంట్రెస్ట్ రేట్లు తగ్గే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ద్రవ్యోల్బణం అంటే ఒక వ్యక్తి సగటున పెట్టే ఖర్చు అని చెప్పొచ్చు. రిటైల్ ఇన్ ఫ్లేషన్ అంటే అదే వ్యక్తి ఆహారం, ట్రాన్స్ పోర్ట్ వంటి రోజువారీ పనుల కోసం పెట్టే ఖర్చు. ఇది పెరిగితే వస్తువుల ధరలు పెరుగుతాయి. కానీ, ద్రవ్యోల్బణం బాగా తగ్గినప్పుడు మాత్రం కేవలం ధరల పెరుగుదల తగ్గడమే కాకుండా లోన్ ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గుతాయి. ఈ క్రమంలోనే ఫ్యూచర్ లో లోన్ EMIలు తగ్గనున్నాయి.
ఇన్‌ఫ్లేషన్ కు కారణాలివే..
- ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారం అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 0.25% కి పడిపోయింది. ఇది గత నెల కంటే తక్కువ. గడిచిన సెప్టెంబర్ నెలలో ఈ ఇన్‌ఫ్లేషన్ 1.4% ఉండేది. ఇక గతేడాదితో పోలిస్తే చాలా తగ్గింది. 2024 అక్టోబర్ లో ఇన్ ఫ్లేషన్ 6.2% ఉండేది.
- రిటైల్ ఇన్‌ఫ్లేషన్ ఇంతలా తగ్గిపోవడానికి ముఖ్య కారణం ఫుడ్ ఇన్‌ఫ్లేషన్. అంటే ఆహార వస్తువులపై పెట్టే ఖర్చు. ఈ ఏడాది ఫుడ్ ధరలు పెరగకపోగా 5% మేరకు తగ్గుముఖం పట్టాయి. ఈ ఎఫెక్ట్ ఓవరాల్ రిటైల్ ఇన్‌ఫ్లేషన్ పై పడింది.
- ఇక మరో ముఖ్యమైన కారణం జీఎస్టీ రేట్ల తగ్గింపు. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లో కొన్ని వస్తువులపై జీఎస్టీ (GST) రేట్లను తగ్గించడం వల్ల చాలా వస్తువుల ధరలు తగ్గాయి. దీంతో ఇన్‌ఫ్లేషన్ భారీగా తగ్గిపోయింది.
రెపో రేటు
రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటుని తగ్గిస్తుంది. రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం ఉండటం వలన RBI తన డిసెంబర్ పాలసీలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (0.25%) తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే వడ్డీ రేట్లు, EMI లు తగ్గే అవకాశం ఉంది. రెపో రేటు తగ్గితే కమర్షియల్ బ్యాంకులు తమ కస్టమర్లకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటును తగ్గిస్తాయి. దీని ఫలితంగా, కొత్తగా రుణం తీసుకునేవారికి లేదా ఫ్లోటింగ్ వడ్డీ రేటు ఉన్నవారికి EMI ల భారం తగ్గుతుంది.
ఎవరికి లాభం
రెపో రేటు తగ్గడం వల్ల బ్యాంకులు తమ ఇంట్రెస్ట్ రేట్లను తగ్గిస్తాయి. దీనివల్ల లోన్స్ తీసుకున్నవారికి బెనిఫిట్ ఉంటుంది. మీ లోన్ ఇంట్రెస్ట్ రేట్(loan interest rate) తగ్గుతుంది. మీ హోమ్ లేదా కార్ లోన్ వడ్డీ అనేది రేటు రెపో రేటుతో ముడిపడి ఉంటుంది. కాబట్టి రెపో రేటు తగ్గిన ప్రతిసారీ మీ EMI తగ్గుతుంది.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications