కరోనా: 2 రోజులు లేదా మార్చి 31 దాకా... స్టాక్ మార్కెట్లు క్లోజ్!? నేడు యథాతథం
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 14వ తేదీ వరకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. ఆయా రాష్ట్రాలు కూడా ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని సూచించాయి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఎవరూ బయటకు రాకపోవడమే ప్రత్యామ్నాయమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కూడా క్లోజ్ చేయాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి.
స్టాక్, కమోడిటీ ట్రేడింగ్‌ను నిలిపివేయాలని మార్కెట్ వర్గాలు SEBIని కోరాయి. రాష్ట్ర ప్రభుత్వాలు బ్రోకింగ్ సర్వీసులను అత్యవసర సేవలుగా గుర్తించని పక్షంలో అన్ని ఎక్స్ఛేంజీల్లో కార్యకలాపాలను నిలిపివేయాలని కమోడిటీ పార్టిసిపేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(CPAI) కోరింది. మార్చి 31వ తేదీ వరకు ఎక్స్చేంజీ క్లోజ్ చేయాలని అభిప్రాయపడింది.

స్టాక్ ఎక్స్ఛేంజీలను కనీసం రెండు రోజులైనా మూసివేయాలని అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్స్ఛేంజెస్ మెంబర్స్ ఆఫ్ ఇండియా (ANMI) SEBIకి విజ్ఞప్తి చేసింది. తద్వారా బ్రోకరేజీ కంపెనీలకు ఔట్ స్టాండింగ్ పొజిషన్స్‌ను క్లోజ్ చేసుకునే అవకాశం లభిస్తుందని తెలిపింది.
అత్యవసర సేవలు మినహా అన్నింటిని క్లోజ్ చేయాలని కేంద్రం సోమవారం ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సూచించిన విషయం తెలిసిందే. అలాగే సెబి నియంత్రిత స్టాక్ మార్కెట్ సంస్థల సేవలను, సంబంధిత వర్క్ ఫోర్స్‌ను మినహాయించాలని సూచించింది.
ఇదిలా ఉండగా, ప్రధాని 21 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ బుధవారం మార్కెట్ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ప్రకటించాయి. ఎక్స్చేంజీలు సాధారణంగానే పని చేస్తాయని ఎన్ఎస్ఈ అధికార ప్రతినిధి తెలిపారు. బీఎస్ఈ కార్యకలాపాలు కొనసాగుతాయని ఎక్స్చేంజీ ఎండీ, సీఈవో ఆశిస్ కుమార్ చౌహాన్ ట్వీట్ చేశారు. లాక్ డౌన్ నుండి అన్ని క్యాపిటల్, డేటె మార్కెట్ సేవలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.


Click it and Unblock the Notifications