మహారాష్ట్ర గవర్నర్, NDA నామినీ అయిన సిపి రాధాకృష్ణన్ ఇటీవల భారతదేశం యొక్క 14వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. భారత రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత.. CP Radhakrishnan ఇండియా బ్లాక్ అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డిపై విజయం సాధించారు. రాధాకృష్ణన్ 452 ఓట్లు సాధించగా, సుదర్శన్ రెడ్డి రెడ్డి 300 ఓట్లు సాధించారు.కాగా రాధాకృష్ణన్ కోయంబత్తూర్ (కర్ణాటక) స్థానం నుండి 5 సార్లు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇందులో ఆయన రెండుసార్లు గెలిచారు. 2019లో జరిగిన చివరి ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయారు.
తాజాగా ఆయన ఆర్థిక అఫిడవిట్ ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. భారీ స్థాయి ఆస్తుల ఉన్నప్పటికీ, ఆయనకు వ్యక్తిగతంగా ఒక్క కారు లేదా బైక్ కూడా లేనటువంటి విషయాన్ని అఫిడవిట్‌లో వెల్లడించారు. ఇది భారత రాజకీయాలలో అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. రాధాకృష్ణన్ రాజకీయాల్లో 40 సంవత్సరాల పాటు సేవలు అందించారు. చిన్న వయసులోనే రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆయన రాజకీయ జీవితాన్ని నిబద్ధతతో నడిపిస్తూ, వ్యాపార రంగంలో కూడా పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా టెక్స్‌టైల్ రంగంలో వ్యాపార సంస్థల్లో వాటాలు కలిగి ఉన్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన అఫిడవిట్ సమర్పించారు. దాని ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ. 7.31 కోట్లు. ఇందులో నగదు, బ్యాంకు డిపాజిట్లు, బాండ్లు, షేర్లు, బీమా పాలసీలు, ఆభరణాలు ఉన్నాయి. భార్యతో కలిపి రూ. 18.15 లక్షల నగదు, రూ. 6.53 లక్షల బ్యాంకు డిపాజిట్లు, రూ. 1.28 కోట్లు షేర్లు మరియు రూ. 1.36 కోట్లు బీమా పాలసీలు ఆయన ఖాతాల్లో ఉన్నాయి
ఆయన స్థిరాస్తులు కూడా భారీగానే ఉన్నాయి. మొత్తం రూ. 48 కోట్లకు పైగా స్థిరాస్తులు, వాటిలో 35.09 కోట్లు వ్యవసాయ భూమి, 5.30 కోట్లు వ్యవసాయేతర భూమి, 6.63 కోట్లు వాణిజ్య భవనం, 1.50 కోట్లు తిరుపూర్‌లో నివాస గృహం కలిగి ఉన్నారు. పెద్ద స్థాయిలో భూములు, వ్యాపార వాటాలు, బంగారం, వజ్రాలతో కూడిన సంపద ఉన్నా కూడా, రాధాకృష్ణన్ ఒక్క కార్ లేదా బైక్ లేదని అఫిడవిట్ లో సమర్పించారు.
CP రాధాకృష్ణన్ గారి ఆస్తుల వివరాలు (2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం )
చరాస్తులు
నగదు రూ. 6.87 లక్షలు, భార్యతో కలిపి: రూ. 18.15 లక్షలు
బ్యాంక్ డిపాజిట్లు రూ. 6.53 లక్షలు
బాండ్లు & షేర్లు రూ. 1.28 కోట్లు
బీమా పాలసీలు రూ. 1.36 కోట్లు
ఆభరణాలు (భార్య పేరు)మీద
బంగారం: 1,284.71 గ్రాములు, విలువ రూ. 31.5 లక్షలు
వజ్రాలు: 152.25 క్యారెట్లు, విలువ రూ. 1.06 కోట్లు
స్థిర ఆస్తులు (భూములు, ఇల్లు):
మొత్తం విలువ రూ. 48 కోట్లకు పైగా.
వ్యవసాయ భూమి: రూ. 35.09 కోట్లు
వ్యవసాయేతర భూమి (నాన్-ఫార్మ్ భూమి): రూ. 5.30 కోట్లు
వాణిజ్య భవనం: రూ.6.63 కోట్లు
తమిళనాడులో తిరుపూర్ లో ఉన్న నివాస గృహం: రూ.1.50 కోట్లు
అతనికి రూ. 2.36 కోట్ల అప్పులు కూడా ఉన్నాయి. ఇంత పెద్ద స్థాయిలో భూములు, బంగారం, వజ్రాలు, షేర్లు ఉన్నా కూడా, ఆయనకి వ్యక్తిగతంగా ఒక్క కారు లేదా బైక్ కూడా లేవని అఫిడవిట్‌లో ప్రకటించారు. ఇది భారత రాజకీయాల్లో చాలా అరుదైన విషయం. ఎందుకంటే, సాధారణంగా ఇతర రాజకీయ నాయకులు లగ్జరీ కార్లు, బైక్‌లు కలిగి ఉంటారు. అఫిడవిట్‌లోనే వాటిని ప్రకటిస్తారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications