ఉరిని దత్తత తీసుకొని అభివృద్ధి చేసిన వాళ్ళని చూసుంటాం లేదా ఊర్లో అభివృద్ధి పనులకు సహకరించిన వారిని చూసుంటాం కానీ ఉరిని ఉరి ప్రజలను లోన్ల బెడద నుండి విముక్షి చేసి వారికీ ఒక జీవన ఆధారం చూపించి, అదే ఉరి పేరుని కూడా ప్రపంచ స్థాయిలో వినిపించేలా చేసిన ఓ మహిళా. అవును ఉరిని చూసి ఉరుకోకుండా నాకెందుకులే అని అనుకోకుండా ఆ ఉరి ప్రజల జీవితాన్నే మార్చేసింది. ఇదేదో సినిమా స్టోరీ కాదు నిజంగా జరిగిన ఒక గొప్ప కథ.

ఒకప్పటి తెలంగాణలో హైదరాబాద్ నుండి దాదాపు 140 కి.మీ దూరంలో ఉన్న హన్మకొండ సమీపంలోని కుమ్మరిగూడెం ఇప్పుడు ప్రపంచ గుర్తింపు పొందింది. ఎందుకో తెలుసా.. ఇక్కడి నెయ్యి క్యాన్లు ప్రతి నెలా US ఇంకా UK అంతటా ఇళ్లకు రవాణా అవుతుంది. ఈ చిన్న గ్రామంలోని విక్రేత నుండి సేకరించిన నెయ్యి టిన్ లీటరు ధర అక్షరాల రూ. 3 వేలు. అంటే దీని ధర మార్కెట్లో లభించే ఇతర నెయ్యి బ్రాండ్ల సగటు ధర కంటే కనీసం నాలుగు నుండి ఐదు రెట్లు ఎక్కువ. ఈ నెయ్యి సాధారణ ఆవు నెయ్యి కాదు, గిరి జాతి ఆవుల పాల నుండి తీసిన హై క్వాలిటీ నెయ్యి. ఒక లీటరు నెయ్యిని తీయడానికి కనీసం 30 లీటర్ల నుండి 35 లీటర్ల పాలు కావాలని స్థానికులు చెబుతున్నారు.
ప్రతి రెండు నెలలకు మేము అట్లాంటాలోని నా కూతురికి అలాగే డల్లాస్‌లోని మరో మూడు కుటుంబాలకు మూడు నుండి నాలుగు లీటర్ల నెయ్యి పంపుతాము. అలాగే ఈ నెయ్యి సప్లయ్ అయిపోకముందే మేము కొత్త షిప్‌మెంట్‌ను ఏర్పాటు చేస్తాము అని హనుమకొండకు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. కొరియర్ ద్వారా ప్రతి షిప్‌మెంట్‌కు కిలోకు దాదాపు రూ. 650 ఖర్చవుతుందని కూడా చెప్పారు.
తెలంగాణ 'న్యూజిలాండ్'గా పేరు పొందిన కుమ్మరిగూడెం కథ : ఇక్కడి 70 ఇళ్లలో ప్రతి ఒక్కరికీ ఒక ఆవు ఉంది ఇంకా వీళ్లు పాడి వ్యాపారం చేస్తుంటారు. 2018లో జర్మన్ దాత మోనికా రేటరింగ్ గ్రామస్తులు అప్పుల నుండి బయటపడటానికి 30 ఆవులను దానం చేయడంతో ఈ ఇదంతా ప్రారంభమైంది. అప్పటి నుండి ఈ కుగ్రామం సమిష్టిగా నెలకు 1,500 లీటర్ల పాలు అలాగే 30 లీటర్ల నెయ్యిని ఉత్పత్తి చేస్తోంది. అంతేకాదు ఇతర పట్టణాలు, గ్రామాలలోని ప్రజల్లో చాలా బాగా పాపులారిటీ అయ్యింది. వినియోగంలో ఎక్కువ భాగం స్థానికంగా ఉన్నప్పటికీ కనీసం 10 లీటర్ల నుండి 15 లీటర్ల వరకు ఈ నెయ్యి కార్గో సర్వీస్ ద్వారా విదేశాలకు రవాణా అవుతుందని ఇక్కడి నివాసితులు చెబుతున్నారు.
నెయ్యికి పెరుగుతున్న ప్రజాదరణ ఒకప్పుడు తీవ్ర ఆర్థిక నష్టాలతో కూరుకుపోయిన గ్రామానికి కూడా అభివృద్ధిని తెచ్చిపెట్టిందని గ్రామస్తులు అంటున్నారు. దీనికి ముందు చాలా మంది ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉండగా, కొంతమందికి చిన్న గేదెల మంద ఉండేది. కానీ వాళ్ల సంపాదన నెలకు రూ. 3,000 కంటే తక్కువ. ఇప్పుడు పాడి ఉత్పత్తుల ద్వారానే రూ. 7,000కి పెరిగింది అని కుమ్మరిగూడెంలో నెయ్యి స్టేషన్ నిర్వహిస్తున్న ఎం. రాజు అన్నారు. మరో గ్రామస్తుడు ఎం. బుచ్చిరాజు మాట్లాడుతూ ఆవుల సంఖ్య ఇప్పుడు 70 కంటే ఎక్కువకి పెరిగిందని అన్నారు. ఇది మా గ్రామ ముఖచిత్రాన్ని మార్చివేసింది ఇంకా ప్రతి ఒక్కరినీ లోన్ల నుండి విముక్తి చేసింది అని ఓ గ్రామస్థుడు సంతోషంతో తెలిపారు.
2018లో ఒకప్పటి వరంగల్ జిల్లాలో జరిగిన ఆత్మహత్యల గురించి వరుస వార్తల నివేదికలు జర్మన్ దాత మోనికా రేటరింగ్‌ను ప్రపంచంలోని ఈ ప్రాంతాన్ని సందర్శించేలా చేశాయి. చిన్న మైక్రోఫైనాన్సింగ్ సంస్థల ద్వారా తీసుకున్న లోన్లలు తిరిగి చెల్లించలేక ప్రజలు ప్రాణాలను తీసుకుంటున్నారని ఆమె గ్రహించింది. దీనితో బాధపడి సహాయం చేయాలని ఆలోచనతో ఆమె కుమ్మరిగూడెంలో స్థిరపడటానికి ముందు జిల్లాలోని గ్రామాల పర్యటనకు వెళ్లింది. గుజరాత్ నుండి వచ్చిన 30 'గిరి' జాతి ఆవులను ఒక్కొక్కటికి రూ.50 వేలు పెట్టి కొని విరాళంగా ఇచ్చి పాడి వ్యవసాయం ప్రారంభించడానికి వారిని ప్రోత్సహించింది. అప్పటి నుండి గత ఏడు సంవత్సరాలలో ఈ గ్రామం సాధించిన అభివృద్ధి చూసి ఆమె చాలా ఉత్సాహంగా ఉంది.
ఈ గ్రామం అద్భుతమైన అభివృద్ధిని చూడటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇంకా ఈ గ్రామంలోని యువతకు చదువు నేర్చుకునే అవకాశాన్ని కూడా ఇచ్చింది. ఇప్పుడు నేను ఈ గ్రామం నుండి నడుస్తున్నప్పుడు, ఇంగ్లీష్ మాట్లాడే యువకులు నాతో పాటు రావడం చూసి నాకు గర్వంగా ఉంది. ఇక్కడి స్థానికులు ఎల్లప్పుడూ చాలా ఆప్యాయంగా ఉంటారు అని 1998 నుండి భారతదేశాన్ని క్రమం తప్పకుండా సందర్శిస్తున్న సత్యసాయి బాబా ఫాలోవర్ మోనికా రేటరింగ్ అన్నారు.
ఈ గ్రామంలో అందరు ఆమెను ప్రేమగా "మేడమ్" అని పిలుస్తారు. గ్రామస్థులు వాళ్ళ ఆరోగ్యకరమైన పశువులను చూడమని, వారి జీవితాలు ఎలా మెరుగుపడ్డాయో, పాల ఉత్పత్తుల వల్ల గ్రామం ఇప్పుడు ఎలా ప్రజాదరణ పొందిందో చెప్పమని నన్ను పిలిచినప్పుడు చాలా సంతృప్తిగా అనిపించింది. వారి సంతృప్తి నుండి నేను చాలా ఆనందాన్ని పొందాను అని ప్రస్తుతం బెర్లిన్‌లో ఉన్న మోనికా రేటరింగ్ అన్నారు.


Click it and Unblock the Notifications