Diwali Holidays: ప్రస్తుతం దేశంలోని చాలా మంది టెక్కీలు, ఇతర కంపెనీల్లో ఉద్యోగులు యూఎస్ కంపెనీల్లో పనిచేస్తుంటారు. అయితే వారి వర్కింగ్ సమయాలు, రూల్స్, సెలవులు.. ఇలా ప్రతిదీ అమెరికా సంస్థ నిర్ణయించినట్లుగా ఉంటాయి. అందుకే మన పండుగలకు వారికి సెలవులు ఉండవు. కానీ ఒక యూఎస్ కంపెనీ మాత్రం ఏకంగా దీపావళికి 10 రోజులు సెలవులను ప్రకటించింది. ఈ షాకింగ్ వార్త పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది అమెరికా కేంద్రంగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న WeWork కంపెనీ గురించే. నిరంతరం ఉరుకులు పరుగుల జీవితంలో కాస్త విరామం తమ ఉద్యోగులకూ అవసరమేనని కంపెనీ భావిస్తోంది. అందుకే పండుగ సమయంలో వారు కుటుంబంతో పాటు ప్రియమైన వారితో సమయాన్ని గడపటం వల్ల.. కొత్త ఉత్సాహం నింపుకుని సంతోషంగా ఉంటారని కంపెనీ చెబుతోంది.

దానికే ప్రాధాన్యత..
కంపెనీ ఎల్లప్పుడూ తన ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలిపింది. అందుకే ఈ పండుగల సమయంలో పూర్తిగా పని నుంచి కొన్ని రోజులు దూరంగా ఉంటూ సెలబ్రేట్ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించింది. ఇందుకోసం ఉద్యోగులకు ఏకంగా 10 రోజులు సెలవులను అందిస్తోంది. ఈ కార్యాక్రమాన్ని మెుదటగా 2021లో ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది.

2022లో ఇలా..
కంపెనీకి 2022 సంవత్సరం చాలా ఆశాజనకమైనదని చీఫ్ పీపుల్ అండ్ కల్చర్ ఆఫీసర్ ప్రీతి శెట్టి వెల్లడించారు. కంపెనీ వ్యాపారం బలంగా వృద్ధి చెందుతోందని, కంపెనీ సెచ్ చేసిన అన్ని టార్గెట్లను తమ ఉద్యోగులు అధిగమించారని ఆమె వెల్లడించారు. ఇది టీమ్ వర్క్ వల్లనే సాధ్యమైందని, వారి మెంటల్ హెల్త్ తమకు చాలా ముఖ్యమైనదని అన్నారు.

స్పెషల్ సౌకర్యాలు..
కంపెనీ తన ఉద్యోగులకు ప్రొఫెషనల్ కౌన్సెలింగ్‌కు యాక్సెస్, కమ్యూనిటీ సర్వీస్ కోసం ఇంపాక్ట్ లీవ్, వర్క్‌లు, ఇన్‌క్లూసివ్ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇలా మరికొన్ని సౌకర్యాలను అందిస్తోంది. దీనికి ముందు ఆన్‌లైన్ షాపింగ్ సైట్ మీషో తన ఉద్యోగుల కోసం 11 రోజుల "రీసెట్ అండ్ రీఛార్జ్" పేరుతో విరామం ప్రకటించింది.

WeWork వ్యాపారం..
అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీ దేశంలో కో వర్కింగ్ ఆఫీస్ స్పెసెస్, వర్క్ స్పెసెస్, ఆఫీసులకు అవసరమైన ఇతర అనుబంధ సేవలను అందించే వ్యాపారంలో నిమగ్నమై ఉంది. ఈ క్రమంలో కంపెనీకి దేశంలోని ప్రధాన నగరాలైన NCR, ముంబై, బెంగళూరు, పూణె, హైదరాబాద్‌లోని 40 ప్రదేశాల్లో 5 మిలియన్ చదరపు అడుగుల ఆస్తులను కలిగి ఉంది. కరోనా తర్వాత అన్ని కంపెనీలు ఉద్యోగులని తిరిగి ఆఫీసులకు రప్పిస్తున్నందున WeWork వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల్లాగా వృద్ధి చెందుతోంది.


Click it and Unblock the Notifications