CoWIN: ఒక్క క్లిక్..పాస్‌పోర్ట్‌తో కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ లింక్ ఇలా: లేకపోతే కష్టమే
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. దాదాపు అన్ని దేశాల్లోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొంటోన్నాయి..క్రమంగా. ఇదివరకు సెకెండ్ వేవ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్‌తో విమానయాన సంబంధాలను తెంచుకున్న దేశాలన్నీ ఒక్కొక్కటిగా పునరుద్ధరించుకునే పనిలో పడ్డాయి. జర్మనీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు విమాన సర్వీసులను ప్రారంభించాయి కూడా. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే ప్రయాణానికి వీలు కల్పిస్తోన్నాయి. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్‌ను పాస్‌పోర్ట్‌తో లింక్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేశాయి.
విదేశాలకు వెళ్లే వారి పాస్‌పోర్టులను వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌తో లింక్ చేయడానికి అవసరమైన చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. కోవిన్ (CoWIN) పోర్టల్ ద్వారా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థులు, ఉద్యోగస్తులు సహా.. టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడానికి బయలుదేరి వెళ్లే వారందరు కూడా తమ పాస్‌పోర్టులతో కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను లింక్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేసిన నేపథ్యంలో- ఇంట్లోనే దాన్ని పూర్తి చేసే వెసలుబాటును కల్పించింది.

విదేశాలకు వెళ్లదలిచిన తొలి డోసు తీసుకున్న వారికి రెండో డోసులో ప్రాధాన్యతను ఇస్తోంది. విదేశాలకు వెళ్లదలిచిన వారు తమ పాస్‌పోర్టును కోవిన్ పోర్టల్ ద్వారా లింక్ చేసుకోవాలనుకుంటే- తొలుత http://cowin.gov.in వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన వెంటనే వ్యాక్సిన్ వేసుకున్నట్లు తెలియజేసే వివరాలతో కూడిన హోమ్ స్క్రీన్ ప్రత్యక్షమౌతుంది. అక్కడే రెయిజ్ యాన్ ఇష్యూ (Raise an Issue) బాక్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
దాన్ని క్లిక్ చేసిన వెంటనే యాడ్ పాస్‌పోర్ట్ డీటెయిల్స్ (Add Passport details) అనే అక్షరాలు కనిపిస్తాయి. అందులో సూచించిన వివరాల ప్రకారం.. దాన్ని భర్తీ చేయాలి. తాము ఏ కంపెనీకి చెందిన వ్యాక్సిన్ తీసుకున్నామనే విషయాన్ని కూడా అక్కడ పొందుపరచాల్సి ఉంటుంది. కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ టీకా వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. అనంతరం సబ్‌మిట్ బటన్ ప్రెస్ చేయాలి. పొరపాటున అక్షరదోషాలు ఏవైనా ఉంటే దాన్ని ఎడిట్ చేసుకునే వీలు కూడా ఉంది.


Click it and Unblock the Notifications