ఇండియాలో బంగారు గనిల ఆవు పేడ.. క్యూ కట్టి కొంటున్న దేశాలు.. అక్కడ ఫుల్ డిమాండ్..
భారతదేశంలో ఆవులను పాల కోసం కొన్ని శతాబ్దాలుగా పెంపకం చేస్తున్నారు. కానీ, దాని పేడలో కూడా ఎన్నో లక్షణాలు ఉన్నాయి, దీని కారణంగా ఆవు పేడని వ్యవసాయంలో ఎరువుగా కూడా ఉపయోగిస్తారు. ఆవు పేడను పెద్ద ఎత్తున ఎరువుగా ఉపయోగించే రైతులను ఇండియాలో చాలా మందిని మీరు చూసే ఉంటారు. అయితే ఇప్పుడు విదేశాల్లో కూడా ఈ ట్రెండ్ మొదలైంది. దింతో ఆవు పేడకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. భారతదేశం ఏ దేశాలకు ఆవు పేడను ఎగుమతి చేస్తుందో తెలుసా... అతిపెద్ద విషయం ఏమిటంటే, ఈ ఎగుమతి కేవలం 10 లేదా 20 కోట్ల విలువైనది కాదు, ఏకంగా వందల కోట్ల విలువైనది. ఈ దేశాల్లో చైనా, అమెరికాతో పాటు కొన్ని అరబ్ దేశాలు కూడా ఉన్నాయి.
2023-24లో ఎన్ని వందల కోట్ల విలువైన ఆవు పేడను ఎగుమతి చేసిందంటే ?
ఎక్సింపీడియా నివేదిక ప్రకారం, 2023-24 సంవత్సరంలో భారతదేశం మొత్తం రూ.125 కోట్ల విలువైన ఫ్రెష్ ఆవు పేడను ఎగుమతి చేసింది. దీంతోపాటు రూ.173.57 కోట్ల విలువైన ఆవు పేడతో తయారు చేసిన ఎరువుని ఎగుమతి చేశారు. ఇంకా 88.02 కోట్ల విలువైన ఆవు పేడను కంపోస్టుగా ఎగుమతి చేయగా ఈ మొత్తం కలిపితే దాదాపు రూ.386 కోట్లు అవుతుంది. అంటే ఒక్క ఏడాదిలో భారత్ రూ.386 కోట్ల విలువైన ఆవు పేడను ఇతర దేశాలకు విక్రయించింది.

ఏ దేశాలు ఆవు పేడను ఎక్కువగా కొన్నాయంటే
భారతదేశం నుండి ఆవు పేడను కొనుగోలు చేసే టాప్ 10 దేశాల గురించి మనం మాట్లాడితే, మాల్దీవులు మొదటి స్థానంలో ఉండగా దీని తర్వాత అమెరికా వస్తుంది. ఈ లిస్టులో సింగపూర్ మూడో స్థానంలో, చైనా నాలుగో స్థానంలో, నేపాల్ ఐదో స్థానంలో ఉన్నాయి. ఆవు పేడను కొనుగోలు చేసే దేశాల లిస్టులో బ్రెజిల్ 6వ స్థానంలో ఉండగా, అర్జెంటీనా 7వ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 8వ స్థానంలో, కువైట్ 9వ స్థానంలో ఉన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) 10వ స్థానంలో ఉంది.
ఆవు పేడతో అరబ్ దేశాలు ఏమి చేస్తాయంటే
ఇతర దేశాలలాగానే ఇక్కడ కూడా ఆవు పేడను ఎక్కువగా వ్యవసాయానికి ఉపయోగిస్తారు. అయితే, ఈ పంటల సాగు కూరగాయలు, ధాన్యాలు కాదు కానీ ఖర్జూరం పంట కోసం. ఇక్కడి పెద్ద రైతులు భారతదేశం నుండి ఆవు పేడను దిగుమతి చేసుకుంటారు, దాని పొడిలాగ తయారు చేసి ఖర్జూరం చెట్ల వేర్ల దగ్గర పోస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇలా చేయడం వల్ల ఖర్జూరాల దిగుబడి మరింత పెరుగుతుంది.


Click it and Unblock the Notifications