కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్, ఆర్థిక వ్యవస్థకు రూ.2 లక్షల కోట్ల నష్టం
కరోనా సెకండ్ వేవ్ కారణంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థకు రూ.2 లక్షల కోట్ల మేర ఔట్‌పుట్ నష్టం వాటిల్లనుందని కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నివేదికలో తెలిపింది. కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. కోలుకుంటోన్న పరిస్థితుల్లో సెకండ్ వేవ్ దెబ్బమీద దెబ్బ తీసింది. చిన్న పట్టణాలు, గ్రామాలకు కూడా వైరస్ వ్యాప్తించింది. దీంతో కార్యకలాపాలు, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుతం సెకండ్ వేవ్ నుండి కోలుకునేందుకు ప్రయత్నిస్తోందని ఈ నివేదిక పేర్కొంది.

గ్రామాలకు కరోనా
చిన్నపట్టణాలు, గ్రామాలకు కరోనా వైరస్ వ్యాపించడంతో ఆర్థిక పరిస్థితి నెలకొందని తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా సెకండ్ వేవ్ నుండి కోలుకొనేందుకు ప్రయత్నిస్తుందని పేర్కొంది. గత సంవత్సరంతో పోలిస్తే కరోనా సెకండ్ వేవ్‌లో వ్యవసాయం, కాంటాక్ట్‌లెస్ సేవలు, పారిశ్రామిక ఉత్పత్తులు, ఎగుమతులు పెరిగినట్లు స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో కరోనా రికవరీ పెరగడం, వ్యాక్సీన్ పంపిణీ వేగవంతం కావడం వల్ల ఆర్థిక వ్యవస్థ అవరోధాల నుండి బయటపడేందుకు అవకాశాలున్నాయని తెలిపింది.

సర్దుబాటులో..
భారత దిగుబడి 2019 రెండో త్రైమాసికం నుండి దిగజారిందని ఆర్బీఐ తెలిపింది. భారత ఆర్థిక ఉద్దీపనలతో సర్దుబాటు మార్గంలో పయనిస్తుందని పేర్కొంది. గత ఏడాది కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇండస్ట్రియల్ ఉత్పత్తి, ఎగుమతులు పెరిగాయి. మున్ముదు వ్యాక్సినేషన్ రికవరీకి ఊతమిస్తుందని తెలిపింది.

స్థూల ఆర్థిక దృష్టి కోణంలో...
స్థూల ఆర్థిక దృష్టి కోణంలో భారత సావరీన్ యీల్డ్స్ కర్వ్ 2019 రెండో త్రైమాసికం నుండి దిగుబడి వక్రతస్థాయి దిగజారిందని తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత జీడీపీ వృద్ధి రేటును ఆర్బీఐ 105 శాతం నుండి 9.5 శాతానికి సవరించింది. తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 18.5 శాతంగా అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications