కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీపై రిటైలర్ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఆదాయమే లేని సమయంలో కేంద్రం నుండి మద్దతు జీరో అని అసహనం వ్యక్తం చేసింది. ఈ రంగంలో 4.6 మిలియన్ల మంది ఉద్యోగ, ఉపాధి పొందుతున్నారి, 20 మిలియన్ల మంది నాన్-ఎసెన్షియల్ రిటైలర్స్‌లో ఉన్నారని తెలిపింది. ఇండియా వినియోగంలో రిటైల్ ఇండస్ట్రీ వాటా 40 శాతంగా ఉంటుందని, జీడీపీలో 10 శాతం వాటా ఉంటుందని గుర్తు చేశారు.

వేతనాలు, వడ్డీలు, రుణాలు, పన్నులతో సంక్షోభంలోకి..
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎకనమిక్ ప్యాకేజీలో తమను పూర్తిగా విస్మరించారని 7 కోట్ల మంది వ్యాపారులు కలిగిన ఈ ఆర్గనైజేషన్ నిరాశ వ్యక్తం చేసింది. ప్రతి వ్యాపారికి వేదనను మిగిల్చిందని, ఆర్థిక ప్యాకేజీ కోసం ఎంతగానో ఎదురు చూశారని పేర్కొంది. CAIT సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత భారీ సంక్షోభం కనిపించడం ఖాయమని, వ్యాపారులు వేతనాలు, వడ్డీలు, బ్యాంకు రుణాలు, పన్నులు చెల్లించవలసి ఉంటుందని, అప్పుడు సంక్షోభంలో కూరుకుపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.

మోడీ ప్యాకేజీ దీర్ఘకాలంలో భేష్..
దాదాపు 20 శాతం మంది వ్యాపారులు తమ వ్యాపారాలను పూర్తిగా క్లోజ్ చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని CAIT తెలిపింది. ఈ 20 శాతంపై ఆధారపడిన మరో 10 శాతం మంది ట్రేడర్స్ కూడా చితికిపోతారని తెలిపింది. ఆత్మనిర్భర్ భారత్ ఆర్థిక ఉద్దీపన కింద కేంద్రం తీసుకున్న చర్యలు దేశానికి దీర్ఘకాలంలో ఉపయోగపడతాయని, కానీ రిటైల్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించలేవని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(RAI) సీఈవో కుమార్ రాజగోపాలన్ అన్నారు. తమని ఏమాత్రం ఆదుకోలేదనన్నారు.

వేతనం, మూలధన రూపాల్లో మద్దతు అవసరం
చిల్లర వ్యాపారులకు కనీస వేతన మద్దతు, తీసుకున్న రుణాలు వాటి వడ్డీలపై మారటోరియం మద్దతు, మూలధనం రూపంలో మద్దతు అవసరమని రాజగోపాలన్ చెప్పారు. రిటైలర్స్ మనుగడ సాధించడానికి ఇవి చాలా కీలకమని చెప్పారు.

ఎంఎస్ఎంఈలతో మాకేం ప్రయోజనం
ఎంఎస్ఎంఈలకు కేంద్ర ప్రభుత్వం అందించే సహాయక చర్యలు చిల్లర వ్యాపారులకు ఏమాత్రం సహాయం చేయవని చెప్పారు. ఎందుకంటే రిటైల్.. ఎంఎస్ఎంఈ సెక్టార్ కిందకు రాదన్నారు. ప్రభుత్వం ఆదుకోకుంటే వ్యాపారాలు మూతపడుతాయన్నారు. రిటైల్ వ్యాపారుల చేతుల్లో ఇప్పుడు మూలధనం అవసరమని, లేదంటే ఈ రంగంలోని 4.6 కోట్ల మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయన్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థకు హాని
కరోనా - లాక్ డౌన్ కారణంగా ఎలాంటి ఆదాయం లేదని, అలాగే ప్రభుత్వం నుండి మద్దతు జీరో అని, ఇలాంటి పరిస్థితుల్లో మనలేదని రాజగోపాలన్ అన్నారు. అదే జరిగితే వినియోగం కూడా భారీగా తగ్గిపోతుందని, ఇది ఆర్థిక వ్యవస్థకు, దేశానికి మరింత హానీ కలిగిస్తుందన్నారు. కాగా, రుణాలపై మారటోరియంతో పాటు ఉద్యోగులకు వేతనాల సహకారం, అద్దెకు మద్దతు వంటి ఉపశమనాలు కోరింది. కానీ ప్యాకేజీలో ఇవి బాగం కాలేదు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications