కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 4 శాతం, రివర్స్ రెపో రేటును 3.35 శాతంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో పాలసీ కమిటీ మూడు రోజుల సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీని 9.5 శాతంగా అంచనా వేస్తున్నట్లు శక్తికాంత దాస్ ప్రకటించారు.
గ్రామీణ ప్రాంతంలో వినియోగ సంబంధిత డిమాండ్ బాగుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. రుతుపవనాల సకాల ఆగమనం ఇందుకు కారణమన్నారు. ఆర్థిక వృద్ధికి అవసరమైన సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. కరోనా వ్యాక్సీన్ వేగవంతం కావడంతో పాటు ఇప్పటికే ప్రకటించిన పలు ఆర్థిక ప్యాకేజీలు ఇందుకు దోహదపడ్డాయన్నారు. కరోనా నేపథ్యంలో హాస్పిటల్ రంగానికి రూ.15,000 కోట్లను ప్రకటించారు.

కరోనా సమయంలో ఎలా వ్యవహరించాలనే అంశానికి సంబంధించి అటు వ్యక్తులు, ఇటు వాణిజ్య సమూహాలు అలవాటు పడుతున్నట్లు తెలిపారు. క్రూడాయిల్ ధరల పెరుగుదల, డిమాండ్ తగ్గడం ఆందోళన కలిగించే అంశాలని చెప్పారు. సిపిఐ ద్రవ్యోల్భణం పూర్తి ఆర్థిక సంవత్సరానికి 5.1 శాతంగా నమోదు కావొచ్చునని అంచనా వేసింది. జూన్ 17న రూ.40 వేల కోట్ల మేర ప్రభుత్వ సెక్యూరిటీస్‌ను కొనుగోలు చేస్తామన్నారు. విదేశీ కరెన్సీ రిజర్వ్‌లు 600 బిలియన్ డాలర్లకు చేరాయన్నారు. దీంతో అంతర్జాతీయంగా ఏదైనా కరెన్సీ ఒడిదుడుకులతో పాటు ఇతర పరిణామాలను సమర్ధవంతంగా ఎదుర్కోగలమన్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications