ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(PMJJBY) పాలసీ కొనుగోలు చేస్తే కరోనాతో మరణించినా పరిహారం లభిస్తుందా, వస్తే ఎంత వస్తుందనేది కొంతమందికి ఉన్న సందేహం. PMJJBY, PMSBY పథకాలు తక్కువ ఖర్చుతో బీమా సౌకర్యం తీసుకు వచ్చేందుకు తెచ్చిన పథకాలు. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తులు ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో మృతి చెందితే బీమా పరిహారం నామినీకి వస్తుంది. ఈ వివరాలు తెలుసుకుందాం....
PMSBY-ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పాలసీకి ప్రీమియం రూ.12. గుర్తింపు పొందిన బ్యాంకులలో పొదుపు ఖాతా ఉన్న 18 సంవత్సరాల నుండి 70 ఏళ్ల వ్యక్తులు ఈ పాలసీ తీసుకోవచ్చు. ప్రమాదంలో పాలసీదారు మృతి చెందితో రూ.2 లక్షలు, శాశ్వత వైకల్యమైతే రూ.1 లక్ష వస్తుంది. కరోనా మరణాలకు ఈ పాలసీకి సంబంధం లేదు.

మరో పాలసీ PMJJBY. ఆ పాలసీకి ప్రీమియం రూ.330. బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతా ఉంటే 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య వయస్కులు అర్హులు. ఒక వ్యక్తికి ఎన్ని ఖాతాలున్నా పాలసీ ఒకటే ఇస్తారు. ఇది ఏటా జూన్ 1వ తేదీ నుండి ప్రారంభమౌతుంది. ఈ పథకంలో కొత్తగా చేరిన 45 రోజుల తర్వాత మాత్రమే బీమా వర్తిస్తుంది. ఈ పాలసీ తీసుకుంటే ఏ కారణంతో మరణించినా రూ.2లక్షల బీమా పరిహారం అందుతుంది. హత్య, ఆత్మహత్యలకు వర్తిస్తుంది. కరోనాతో మరణించినా వారికి ఈ బీమా పాలసీ రూ.2 లక్షల పరిహారం వస్తుంది.
ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే నామినీలు 30 రోజుల్లోగా పాలసీ ఉన్న బ్యాంకు శాఖను సంప్రదించి క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. క్లెయిమ్ సమర్పించిన 30 రోజుల్లోగా బ్యాంకు ఆ క్లెయిమ్ ఫారాన్ని సంబంధింత బీమా కంపెనీకి పంపిస్తుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications