For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Covid 19తో పదేళ్ల దెబ్బ: అమెరికా పరిస్థితి దారుణం.. 2030 వరకు అంతే

|

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ ఆంక్షలను ఆయా దేశాలు ఎత్తివేస్తున్నాయి. వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఏళ్ల తరబడికి కూరుకుపోతున్నాయి. కోలుకోవడానికి ఏడాదికి పైగా పడుతాయని అంచనా వేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ గత వృద్ధిని అందుకోవడానికి మూడేళ్లు పట్టవచ్చునని ఓ సర్వే అంచనా వేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికాకు కరోనా వల్ల దాదాపు పదేళ్ల నష్టం జరిగిందని కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (CBO) అంచనా వేసింది.

భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది, మీకు ఆశ్చర్యం వేయొచ్చు కానీ: నరేంద్ర మోడీభారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది, మీకు ఆశ్చర్యం వేయొచ్చు కానీ: నరేంద్ర మోడీ

అగ్రరాజ్యం పరిస్థితి దారుణం, ఊహించని నష్టం.. 2030 దాకా..

అగ్రరాజ్యం పరిస్థితి దారుణం, ఊహించని నష్టం.. 2030 దాకా..

కరోనా కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థను ఈ ఏడాది నుండి 2030 మధ్య అంటే పదేళ్లపాటు 3 శాతం తగ్గిస్తుందని అంచనా వేసింది. ఈ మహమ్మారి వల్ల జరిగిన నష్టం 7.9 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా వేసింది. లాక్ డౌన్ కారణంగా కోట్లాది మంది ఉద్యోగాలు పోవడం, వ్యాపారాలు నిలిచిపోవడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊహించని నష్టం జరిగిందని అభిప్రాయపడింది.

కరెన్సీ పంప్ చేసినా.. తిరోగమనమే

కరెన్సీ పంప్ చేసినా.. తిరోగమనమే

అమెరికా ఆర్థిక వ్యవస్థలోకి ప్రభుత్వం ట్రిలియన్ డాలర్ల కొద్ది పంప్ చేసింది. అయినప్పటికీ తిరోగమనం తప్పదని చెబుతున్నారు. CBO భారీ నష్టం ఉంటుందని దాదాపు తొలిసారి అంచనా వేసింది. అమెరికాలో నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోన్న విషయం తెలిసిందే. కోట్లాది మంది దరఖాస్తు చేసుకున్నారు.

వినియోగదారుల వ్యయం తగ్గిపోతుంది, పెట్టుబడుల షాక్

వినియోగదారుల వ్యయం తగ్గిపోతుంది, పెట్టుబడుల షాక్

వ్యాపారాలు మూతబడటం, సామాజిక దూరం పాటించడం వంటి అంశాలు వినియోగదారుల వ్యయాన్ని తగ్గిస్తాయని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇంధన ధరలు భారీగా పడిపోయాయి. దీంతో అమెరికా ఎనర్జీ సెక్టార్‌లోను భారీగా పెట్టుబడులను తగ్గిస్తాయని భావిస్తున్నారు. కరోనా అమెరికాను తాకినప్పటి నుండి అమెరికా ప్రభుత్వం, కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున డాలర్లు వ్యవస్థలోకి జొప్పించాయి. ఇంత చేసినప్పటికీ నిరుద్యోగం, ఆర్థికమాంద్యం 1930 నాటి పరిస్థితికి దిగజారింది.

ఉద్యోగాల కోత

ఉద్యోగాల కోత

అమెరికాలో ఇప్పటివరకు 4 కోట్లకు పైగా ఉద్యోగాలు పోయాయని అంచనా. అమెరికాలో నిరుద్యోగిత రేటు 14.7 శాతానికి చేరుకుంది. అమెరికా కార్మిక శాఖ ప్రకారం ఏప్రిల్ నెలలో ఇది 20 శాతానికి చేరుకుంది. మార్చిలో నిరుద్యోగిత రేటు కేవలం 4.4 శాతంగా మాత్రమే ఉంది. సీబీవో అనేది అమెరికా ప్రభుత్వంలోని ఓ సమాఖ్య సంస్థ. ఇది కాంగ్రెస్‌కు బడ్జెట్, ఆర్థిక సమాచారం అందిస్తుంది.

English summary

Covid 19తో పదేళ్ల దెబ్బ: అమెరికా పరిస్థితి దారుణం.. 2030 వరకు అంతే | Covid 19 could drag on US economy for a decade

The drag on the US economy from the virus pandemic will last almost a decade, according to projections by the Congressional Budget Office (CBO).
Story first published: Tuesday, June 2, 2020, 18:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X