కరోనా సెకండ్ వేవ్‌తో భారత్ అతలాకుతలమవుతోంది. అంతకుముందు 45 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా వ్యాక్సినేషన్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఇప్పుడు మే ఒకటో తేదీ నుండి పద్దెనిమిదేళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ చేపట్టాలని నిర్ణయించింది. అయితే అందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ తమ వల్ల కాదని తేల్చేసింది. ప్రయివేటుగా బహిరంగ మార్కెట్లో వ్యాక్సినేషన్ కొనుగోలు చేయాలని సంకేతాలు ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా గ్లోబల్ వ్యాక్సీన్స్ తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యాక్సీన్ విక్రయ ధరలు ప్రకటించింది.

వ్యాక్సీన్ ఖర్చు
సీరం సంస్థ కేంద్రానికి రూ.150కి వ్యాక్సీన్ సరఫరా చేసింది. కేంద్రం, రాష్ట్రాలతో పాటు ప్రయివేటు ఆసుపత్రులకు వ్యాక్సీన్ సరఫరా చేసింది. తాజాగా కేంద్రానికి రూ.150, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400కు, ప్రయివేటు ఆసుపత్రులకు రూ.600కు సరఫరా చేస్తామని సీరం సంస్థ ప్రకటించింది.
భారతీయులందరికీ పద్దెనిమిదేళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ చేయాలంటే రూ.67,193 కోట్లు ఖర్చవుతుందని ఓ అధ్యయనం అంచనా. రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో రూ.46,323 కోట్లు భరించగలవని తేలింది. కేంద్రం తన వాటాగా రూ.20,870 కోట్లు భరించవచ్చు. ఇది దేశ జీడీపీలో 0.36 శాతమేనని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్-రా) పేర్కొంది.

వారికి ఉచితం
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 133.26 కోట్ల మంది జనాభాలో 84.19 కోట్ల మంది వ్యాక్సినేషన్‌కు అర్హులు. వ్యాక్సిన్ల ధరలు, సేకరణ, వ్యాక్సినేషన్ నిర్వహణ మరింత సౌలభ్యకరంగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్, 45 ఏళ్లు దాటిన వారికి ఉచిత వ్యాక్సినేషన్ అని కేంద్రం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అదనంగా అవసరమైతే నేరుగా ఫార్మా సంస్థల నుండి కొనుగోలు చేసేందుకు అనుమతించింది.

సెకండ్ డోస్ ఖర్చు
భారత వ్యాక్సీన్ తయారీదారులు వ్యాక్సీన్లను 50 శాతం కేంద్రానికి, మిగతా 50 శాతం రాష్ట్రాలు, ప్రయివేటు ఆసుపత్రులకు అమ్ముకోవడానికి పచ్చజెండా ఊపింది. ఇప్పటి వరకు 21.4 కోట్ల వ్యాక్సిన్ల సేకరణకు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థలకు కేంద్రం రూ.5,090 కోట్లు మంజూరు చేసింది. సెకండ్డోస్ వ్యాక్సీన్లకు రూ.400 కోట్లుగా అంచనాలు ఉన్నాయి. ఈ లెక్కన 84.19 కోట్ల మందికి సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కోసం రూ.62.103 కోట్లు అవుతుంది. ఇప్పటికే పలు కార్పొరేట్ సంస్థలు తమ సిబ్బందికి వ్యాక్సినేషన్ ఉచితంగా అందిస్తున్నాయి. 18 ఏళ్ల నుండి 44 ఏళ్లు ఉన్న ప్రజలకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications