దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తోంది. దేశంలో రోజుకు లక్షల కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర వంటి రాష్ట్రాలపై భారీ ప్రభావం కనిపిస్తోంది. కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతుండటంతో ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోతున్నాయి. కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని చర్యలు చేపడుతోంది. ఇలాంటి సమయంలో కొంతమంది స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు మెడికల్ ఆక్సిజన్ కొరతను త్వరగా లాభాలు పొందే అవకాశంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఆక్సిజన్ స్టాక్స్ జంప్
ఆసుపత్రుల్లో మెడికల్ ఆక్సిజన్ కొరత నేపథ్యంలో పలు నగరాల్లో ఆక్సిజన్ సిలిండర్ ధరలు రెండింతలు అయ్యాయి. దీంతో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు గ్యాస్ తయారీ సంస్థల స్టాక్స్ ఎంచుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర విషయం చోటు చోసుకుంది. కంపెనీలు ఆ రంగంలో ఉన్నాయా లేదా అనే అంశాన్ని పక్కన పెట్టి పేరులో ఆక్సిజన్ అని కనిపించగానే కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ రంగంలో లేని బాంబే ఆక్సిజన్ షేర్స్ ఇటీవల భారీగా ఎగిశాయి. ఆక్సిజన్ కొరత నేపథ్యంలో ఆ రంగంలో లేని ఈ కంపెనీ ప్రస్తుత పరిస్థితుల్లో లాభపడింది.

బాంబే ఆక్సిజన్ కార్పోరేషన్
బాంబే ఆక్సిజన్ కార్పోరేషన్ లిమిటెడ్ 1960లో వచ్చింది. ఇది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. ఇది ఆక్సిజన్ ఉత్పత్తిలో లేని సంస్థ. ఈ కంపెనీ ప్రైమరీ బిజినెస్ ఇండస్ట్రియల్ గ్యాస్ తయారీ, సరఫరా. 2019 ఆగస్ట్ 1వ తేదీ నుండి ఇది నిలిచిపోయింది. ఈ కంపెనీకి షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ రూపంలో గణనీయ ఆర్థిక పెట్టుబడులను కలిగి ఉంది. అలాంటి పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం సంస్థ యొక్క ఆదాయ వనరు.

స్టాక్స్ జంప్
ప్రస్తుతం ఈ కంపెనీ ఆక్సిజన్ తయారీలో లేనప్పటికీ ఈ కంపెనీ షేర్లు ఇటీవల భారీగా ఎగిశాయి. మార్చి 31న రూ.11,025గా ఉన్న ఈ స్టాక్స్ మంగళవారం, ఏప్రిల్ 20 నాటికి ఇంట్రాడేలో రూ.25,500కు చేరుకుంది. కేవలం 12 సెషన్‌లలో 131.1 శాతం పెరిగింది. ఫిబ్రవరి 1న ఈ స్టాక్ రూ.9,964 వద్ద ఉంది. ఈ మూడు నెలల కాలంలో 156 శాతం ఎగిసింది. అదే ఫిబ్రవరి 1 నుండి ఏప్రిల్ 20 మధ్య సెన్సెక్స్ 1.84 శాతం క్షీణించింది. ప్రస్తుతం నేటికి (ఏప్రిల్ 22) ఈ స్టాక్స్ రూ.22,178 వద్ద ఉంది.
More From GoodReturns

Stock market: సెన్సెక్స్ పతనం.. కానీ రికవరీ మొదలైందా? నేటి మార్కెట్ టాప్ విన్నర్స్ వీరే!

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!



Click it and Unblock the Notifications