Blue Dart: ఇండియా పేరును భారత్ గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందంటూ ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల దిల్లీలో నిర్వహించిన జీ20 సదస్సులో ప్రధాని మోదీ ముందు భారత్ నేమ్ బోర్డ్ కనిపించటం పేరు మార్పు సంకేతాలను బలపరుస్తోంది.
అయితే కార్పొరేట్ కంపెనీలు సైతం దీనిని క్యాష్ చేసుకోవాలని ముందుగానే తమ సేవల పేర్లలో మార్పులను చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో లాజిస్టిక్స్ మేజర్ బ్లూ డార్ట్ బుధవారం దేశంలో తన ప్రీమియం సర్వీస్ డార్ట్ ప్లస్ పేరును భారత్ ప్లస్‌కి రీబ్రాండ్ చేసినట్లు ప్రకటించింది. ఇది కంపెనీ ప్రయాణంలో కీలక మైలురాయిగా కంపెనీ పేర్కొంది. ప్రజల విభిన్న అవసరాలను తీర్చేందుకు తమ నిబద్ధతను నొక్కి చెబుతుందని అన్నారు.

రీసెర్చ్ తర్వాత పేరు మార్పు ఆలోచన పుట్టినట్లు కంపెనీ వెల్లడించింది. బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ భారత్‌ను ప్రపంచానికి, ప్రపంచాన్ని భారత్‌కు అనుసంధానం చేయడం కొనసాగించినందున ఈ పరివర్తన ప్రయాణంలో చేరాలని అన్ని వాటాదారులను ఆహ్వానిస్తున్నదని ప్రకటన పేర్కొంది. దీంతో కంపెనీ స్టాక్ మార్కెట్లో 2.32 శాతం పెరిగి రూ.6,769.00 వద్ద ట్రేడవుతోంది.
భారత్ డార్ట్ అనేది టైమ్ సెన్సిటివ్ డెలివరీ సర్వీస్. ఇందులో వేగం, భద్రత, వ్యాల్యూ యాడెడ్ సర్వీసులతో డిజిటల్ పేమెంట్స్ ఎంపికలను కలిగి ఉన్న సేవగా కంపెనీ తెలిపింది. కంపెనీ ఇండియాలో తన భారత్ డార్ట్ ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్‌ను పునర్నిర్వచించటానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా 220 దేశాల్లో తన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. జూన్ 30, 2023తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ పన్ను తర్వాత రూ.59.74 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. అలాగే కార్యకలాపాల ద్వారా రూ.1,238 కోట్ల ఆదాయాన్ని నివేదించింది.


Click it and Unblock the Notifications