AI newsreader: మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ వినియోగం సైతం విపరీతంగా పెరిగింది. ప్రస్తుత డిజిటల్ యుగంలో AI వినియోగం ప్రపంచాన్ని మొత్తం కుదుపేస్తోంది. ChatGPT రాకతో ఇది మరింత ఎక్కువగా ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మీడియా రంగంలో వినియోగిస్తుండగా, దేశంలో ఇదే మొదటిసారి కావడం విశేషం.
మీడియా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రవేశపెట్టడం ద్వారా ఒడిశా చరిత్ర సృష్టించింది. ఒడిశా టెలివిజన్ లిమిటెడ్ AI ఆధారిత న్యూస్ ప్రజెంటర్ లీసాతో వార్తలు చదివించింది. అందులోనూ ఒడియాలో న్యూస్ ప్రజెంట్ చేసిన మొదటి AI ప్రజెంటర్ లీసానే కావడం గమనార్హం.

లీసా కోసం సాంకేతికను అభివృద్ధి చేసే తరుణంలో ట్రాన్సలేషన్ విషయంలో కొన్ని సవాళ్లు తలెత్తినట్లు OTV మేనేజింగ్ డైరెక్టర్ జగి మంగత్ పాండా తెలిపారు. చివరికి గూగుల్ అనువాద సామర్థ్యాన్ని మించి లీసా పట్టు సాధించిందని వెల్లడించారు. న్యూస్ డెలివరీలో ఇదొక సంచలనాత్మక డెవలప్‌మెంట్ గా పేర్కొన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీల ద్వారా.. ఖచ్చితత్వంతో కూడిన వార్తలను అందించేందుకు లీసా రూపొందించబడినట్లు పాండా చెప్పారు. ప్రస్తుతం ఒడియా, ఇంగ్లీష్ భాషల్లో వార్తలను ప్రసారం చేయగలదని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని భాషలకు లీసా సేవలు విస్తరించాలని భావిస్తున్నట్లు ప్రకటించారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications