భారత్ వద్ద బంగారు నిల్వలు ఎక్కువగానే ఉంటాయని అందరికీ తెలుసు. కానీ ప్రపంచంలో అత్యధికంగా బంగారు నిల్వలు ఉన్న టాప్-10 దేశాల గురించి మీకు తెలుసా? ఈ సారి భారత్ కూడా టాప్ దేశాల జాబితాలో నిలిచింది. అసలు ఏఏ దేశం వద్ద ఎన్ని టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ప్రపంచ పెద్దన్న అమెరికా వద్ద అత్యధికంగా 8,133 టన్నుల బంగారం నిల్వ ఉంది. దీంతో ఆ దేశం మెుదటి స్థానంలో నిలిచింది. ఇక అమెరికా తరువాతి స్థానంలో యూరోపియన్ దేశమైన జర్మనీ 3,359 టన్నుల బంగారాన్ని కలిగి ఉంది. మూడో స్థానంలో 2,451 టన్నుల బంగారం నిల్వలతో ఐరోపాలోని ఇటలీ నిలిచింది.

రష్యా దగ్గరం ఎంత బంగారం ఉందంటే..
ప్రపంచంలో అత్యధికంగా బంగారం నిల్వలు ఉన్నాయని చర్చ జరుగుతున్న సమయంలో ఫ్రాన్స్ 2,436 టన్నుల బంగారాన్ని కలిగి ఉంది. దీంతో ఆ దేశం నాల్గవ స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానంలో ఇప్పుడు ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యా నిలిచింది. ఐదవ స్థానంలో ఉన్న రష్యా వద్ద ఏకంగా 2,299 టన్నుల బంగారం ఉందని తెలుస్తోంది. ఇక ప్రపంచానికి పెద్దన్నగా మారాలనుకుంటున్న చైనా ఆరవ స్థానంలో 1,948 టన్నుల బంగారం నిల్వలను కలిగి ఉంది.

భారత స్థానం ఎంతో తెలుసా.
.
అందమైన దేశాల్లో ఒకటి ఉంటూ పర్యాటకులను ఆకట్టుకునే స్విట్జర్లాండ్ బంగారం నిల్వల విషయంలో ఏడవ స్థానంలో నిలిచింది. ఇందుకు గాను ఆ దేశం వద్ద 1,040 టన్నుల బంగారం నిల్వ ఉంది. వేగంగా అభివృద్ధి చెందిన జపాన్ ఎనిమిదవ స్థానంలో కేవలం 845 టన్నుల బంగారం నిల్వలు కలిగి ఉంది. ఇక తొమ్మిదవ స్థానంలో భారత్ నిలిచింది. ఇందుకు గాను భారత్ వద్ద 743.83 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం.. ప్రపంచంలో బంగారం ఎక్కువగా నిల్వలు కలిగి ఉన్న టాప్-10 దేశాల్లో చివరికి భారత్ చోటు దక్కించుకుంది.

టాప్-10లో నిలిచిన నెదర్లాండ్స్..
ఇక చిట్ట చివరిగా విండ్‌మిల్స్, తులిప్స్, విండ్‌మిల్స్ కు ఫేమస్ అయిన యూపోపియన్ దేశం నెదర్లాండ్స్ బంగారం నిల్వల విషయంలో పదవ స్థానంలో నిలిచింది. ఆ దేశం వద్ద 612 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. పైన తెలిపిన బంగారం నిల్వలు, దేశాల ర్యాంకులు గోల్డ్ హబ్ డేటా ప్రకారం వెల్లడించినవి
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications