For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Multibagger Stock: ఇన్వెస్టర్లను ధనవంతులు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్.. లక్ష పెట్టిన వారికి రూ.5 లక్షలు..

|

Multibagger Stock: స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లను ధనవంతులను చేసే ఇలాంటి స్టాక్‌లు చాలా ఉన్నాయి. కానీ వారు చేయవలసిందల్లా సరైన కంపెనీల్లో పెట్టుబడి పెట్టటమే. ఇందుకోసం కొంత స్టడీ చేయవలసి ఉంటుంది. అలా మంచి ఫండమెంటల్స్, స్ట్రాంగ్ గ్రోత్, మంచి ఫైనాన్సియల్స్, ఇండస్ట్రీ ఫ్యూచర్ వంటి అంశాల ఆధారంగా సదరు స్టాక్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం అలాంటి స్టాక్ గురించి తెలుసుకుందాం..

ఐదు రెట్లు పెరిగిన పెట్టుబడి:

ఐదు రెట్లు పెరిగిన పెట్టుబడి:

పైన చెప్పిన విధంగా స్మాల్ క్యాప్ కంపెనీ అయిన ప్యాకేజింగ్ ఫిల్మ్ స్టాక్, గత రెండేళ్లలో ఇన్వెస్టర్లకు 396 శాతం రాబడిని అందించింది. ఈ స్టాక్ లో ఎవరైనా 2 సంవత్సరాల క్రితం లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే.. దాని విలువ ఇప్పుడు దాదాపు రూ. 4,96,320 అయి ఉండేది. అంటే.. ఇన్వెస్టర్లకు 396.32% రాబడి వచ్చింది. కాస్మోఫిల్మ్స్ తన వ్యాపారాన్ని స్పెషాలిటీ ఫిల్మ్‌లు, స్పెషాలిటీ కెమికల్స్, డిజిటల్-ఫస్ట్, D2C పెట్ కేర్ వ్యాపారాల్లోకి విస్తరించింది.

పతనమవుతున్న మార్కెట్లోనూ..

పతనమవుతున్న మార్కెట్లోనూ..

గత సంవత్సర కాలంలో బెంచ్‌మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ హై ఓలటాలిటీ కారణంగా కేవలం 0.45 శాతం స్వల్ప లాభంతో ఫ్లాట్‌గా ఉంది. ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ 0.36 శాతం నష్టాన్ని చవిచూసింది. ఈ సమయంలో కాస్మో ఫిల్మ్స్ స్టాక్ మాత్రం ఏకంగా 75.71 శాతం వృద్ధిని సాధించింది. కాస్మో ఫిల్మ్స్ గత వారం కూడా స్టాక్ మార్కెట్లలో మంచి పనితీరును కనబరిచింది . ఇది వారంలో 14 శాతం మేర పెరిగింది. జూన్ 27న 8.08 శాతం లాభపడిన ఈ స్టాక్ గరిష్ఠ ర్యాలీని చూసింది. ఒకే ట్రేడింగ్ సెషన్‌లో స్టాక్ 14.24 శాతం పెరిగిన స్టాక్.. ఏప్రిల్ 4 తర్వాత ఇంత పెద్ద ర్యాలీని నమోదు చేసింది.

బలమైన ఆదాయం:

బలమైన ఆదాయం:

కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కంపెనీ ఆదాయం Q4FY21లో రూ.671.80 కోట్ల నుంచి రూ.820.88 కోట్లకు చేరింది. అంటే ఏడాది ప్రాతిపదికన 22.19 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ నమోదు చేసిన రూ. 74.75 కోట్ల లాభంతో పోలిస్తే టాక్సులు చెల్లించిన తరువాత ఆదాయం రూ.108.18 కోట్లకు చేరింది. అంటే ఇది ఏడాది ప్రాతిపదికన లాభాల్లో 45.31 శాతం వృద్ధిని చూపుతోంది.

షేర్ ధర వివరాలు:

షేర్ ధర వివరాలు:

కంపెనీ షేరు ధర ప్రస్తుతం 8.16x PE వద్ద ట్రేడవుతోంది. మార్చి 2022లో ఇది 32.75 శాతం RoEని నమోదు చేసింది. ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో కాస్మో ఫిల్మ్స్ స్టాక్ ధర 0.96 శాతం తగ్గి రూ. 978.40 వద్ద ట్రేడ్ అవతోంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.1,428గా ఉండగా.. దీని 52 వారాల కనిష్ఠ ధర రూ.647గా ఉంది.

గమనిక: పైన తెలిపిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆదారంగా ఎలాంటి ట్రేడింగ్ చేయకండి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ ఆర్థిక నిపుణుల సలహాలను తీసుకోండి.

English summary

Multibagger Stock: ఇన్వెస్టర్లను ధనవంతులు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్.. లక్ష పెట్టిన వారికి రూ.5 లక్షలు.. | Cosmo Films stock gave multibagger returns to its investors in two years rose 400 percent in this time

know about this multibagger stock that turned one lakh to five lakhs
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X