వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ ప్రధానకేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలను సాగిస్తోన్న ప్రముఖ కాస్మొటిక్స్ కంపెనీ రెవ్లాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ పతనం అంచుల్లో నిలిచింది.. దివాళా తీయడానికి చేరువైంది. త్వరలోనే దివాళా ప్రతిపాదనలను సమర్పించబోతున్నట్లు వార్తలు వస్తోన్నాయి.
బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తడిసిమోపెడు కావడం, కాస్మొటిక్స్ సెగ్మెంట్‌లో పోటీ తీవ్రం కావడం, పరిస్థితులకు అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకోలేకపోవడం వంటి కారణాలు.. దివాళా తీయడానికి ప్రధాన కారణమైనట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. దివాళా తీసినట్లు సమాచారం అందిన వెంటనే రెవ్లాన్ కంపెనీ షేర్ల ధరలు పాతాళానికి పడిపోయాయి.

న్యూయార్క్ స్టాక్ఎక్స్ఛేంజ్‌లో కొన్ని గంటల్లో డాలర్ల కొద్దీ సంపద ఆవిరైపోయింది. అమెరికా స్టాక్ మార్కెట్లో రెవ్లాన్ షేర్ల ట్రేడింగ్ 53 శాతం మేర పతనం అయ్యాయి. 250 డాలర్లతో నాస్‌డాక్‌లో లిస్టింగ్ అయిన రెవ్లాన్ ఒక్కో షేర్ ధర..ప్రస్తుతం 2.05 డాలర్లకు పడిపోయిందంటే.. వాటి దుస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది మార్చ్ 31వ తేదీ నాటికి రెవ్లాన్ కంపెనీ రుణాలు 3.31 బిలియన్ డాలర్లు.
1932లో ఏర్పాటైన కాస్మొటిక్స్ కంపెనీ ఇది. మెక్ఆండ్రూస్ అండ్ ఫోర్బ్స్ దీన్ని స్థాపించాయి. అమెరికన్ బిలియనీర్ రాన్ పెరెల్‌మ్యాన్ దీని అధిపతి. మొత్తం 15 బ్రాండ్లను ప్రమోట్ చేస్తోంది. ఎలిజబెత్ అర్డెన్, ఎలిజబెత్ టేలర్ పేరుతో స్కిన్ కేర్, మేకప్, పెర్‌ఫ్యూమ్స్ విక్రయిస్తోంది.
ఎస్టీ లాడర్స్ వంటి కొన్ని కంపెనీల నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది.. రెవ్లాన్.
సప్లయి చెయిన్ సమస్యల తోడయ్యాయి. తన ప్రొడక్టులను సకాలంలో మార్కెట్‌కు తరలించలేకపోతోంది. షిప్పింగ్ సమస్యలను ఎదుర్కొంటోంది. వెరసి.. దివాళా తీయడానికి దారి తీశాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి ముందు నుంచే దీని సేల్స్ తగ్గుముఖం పట్టాయి. కోవిడ్ తరువాత సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. అమ్మకాలు పెరగలేదు.
కాగా దివాళా పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి చివరి ప్రయత్నాలు చేస్తోంది. రుణదాతలతో సంప్రదింపులు జరుపుతోంది. ఈక్విటీ ఓనర్‌షిప్స్‌తో మంతనాలు చేస్తోంది. ఇవి ఫలిస్తాయనే నమ్మకం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సంప్రదింపులు ఫలించకపోతే.. వచ్చే వారం బ్యాంక్‌రప్ట్సీ ఫైల్స్‌ను రెగ్యులేటరీకి సమర్పిస్తుందని స్పష్టం చేస్తోన్నాయి.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications