Nvidia perks: కంపెనీల్లో పనిగంటలు, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి ఇటీవల ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు వాదోపవాదాలకు సైతం దిగారు. ఈ విధానాన్ని కొందరు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. కాలక్రమేణా ఆ వివాదం ఇప్పుడు సద్దుమణిగింది. అయితే మరోసారి అది తెరమీదకు వచ్చేలా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
ప్రముఖ అంతర్జాతీయ చిప్ మేకింగ్ సంస్థ ఎన్విడియా గురించి ఈ డిబేట్ తిరిగి మొదలైంది. ఇటీవలే ప్రపంచ IT దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ను కూడా వెనక్కి నెట్టి మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా చరిత్ర సృష్టించింది. అయితే దాని ఎదుగుదల వెనుక ఎంతో మంది ఉద్యోగుల కఠోర శ్రమ దాగి ఉందనే విషయం చాలామందికి తెలియదు. 7 రోజుల పనితో పాటు అర్ధరాత్రి దాటి 2 గంటల వరకు సంస్థలో ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారని తెలిసి కార్పొరేట్ ప్రపంచంతో పాటు జాబ్ మార్కెట్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

ఎన్విడియాలో పని పరిస్థితులను ఓ మాజీ ఉద్యోగి వివరించారు. అది కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది. అక్కడ పనిచేయడాన్ని 'గోల్డెన్ హ్యాండ్ కప్స్'గా అతడు అభివర్ణించాడు. సిబ్బంది పరిస్థితి ప్రెషర్ కుక్కర్ లాగా ఉంటుందన్నాడు. సుదీర్ఘ మీటింగ్స్ సహా పని ఒత్తిడి తీవ్ర స్థాయిలో ఉంటుందని వెల్లడించాడు. అయినప్పటికీ ఉద్యోగులు కంపెనీని వీడేందుకు ఇష్టపడరని చెప్పి మరో షాక్ ఇచ్చాడు. అందుకు కారణం చేసే పనికి తగిన స్థాయిలో పారితోషకాలు ముట్టడమేనని స్పష్టం చేశాడు.
2019 నుంచి చూస్తే కంపెనీ స్టాక్ విలువ ఏకంగా 3 వేల 700 శాతం ఆకాశాన్ని అంటే స్థాయిలో పెరిగింది. తద్వారా ఉద్యోగులు తమ స్టాక్ ఆప్షన్ ద్వారా భారీ రిటర్న్స్ వెనకేసుకుంటున్నారు. దీనికితోడు భారీ స్థాయిలో జీతాలు, వాటికి మించి లగ్జరీ కార్లు, వెకేషన్ హోమ్స్, ప్రీమియం ఈవెంట్ టికెట్లు సిబ్బందికి అందుతాయని సదరు ఉద్యోగి పేర్కొన్నాడు. పోర్షెస్, లాంబోర్గినీ వంటి అత్యాధునిక కార్లతో నిండి ఉండే పార్కింగ్ స్థలమే సంస్థ ఉద్యోగుల రాజభోగాలకు నిదర్శనమని ఒక్క మాటలో తేల్చిచెప్పాడు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications