Nirmala Sitharaman: ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు తన చివరి బడ్జెట్ ప్రసంగాన్ని ప్రవేశపెట్టింది. అయితే వరుసగా వార్షిక బడ్జెట్లను కష్టకాలంలో ప్రవేశపెట్టి ఆర్థిక వ్యవస్థను గాడి తప్పకుండా నిర్మలా సీతారామన్ కాపాడారంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది.
కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులైన చాలా మంది ఈ విషయంలో నిర్మలా సీతారామన్ పనితీరును కొనియాడుతున్నారు. 2024 బడ్జెట్ ప్రసంగంలోని అంశాలు మాంద్యం అనే జంతువును ఎదుర్కోవటానికి అనుకూలంగా ఉంచబడ్డాయని హర్ష గోయంకా పేర్కొన్నారు. అలాగే ఉపాధి, ఉద్యోగ కల్పన, విద్య, యువతతో పాటు కోట్ల మంది ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా ఆర్థిక మంత్రి నిర్ణయాలు ఉన్నాయని కొనియాడారు.

ఇదే సమయంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. చాలా ఏళ్లుగా దేశంలోని ప్రజలు బడ్జెట్ చుట్టూ భారీ ఆశలు పెంచుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలకు ముందల షార్ట్ బడ్జెట్ ప్రసంగాన్ని కొనియాడారు. అలాగే ఆర్థిక లోటు ఊహించిన దాని కంటే తక్కువగా ఉండటాన్ని అభినందించారు.
ఇదే క్రమంలో బయోకాన్ ఫౌండర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన మధ్యంతర బడ్జెట్‌పై స్పందించారు. పోల్స్‌కు ముందు చివరి బడ్జెట్‌లో పన్ను మార్పు లేకపోవటంతో పాటు "విక్షిత్ భారత్" మంత్రం సమగ్రమైన ఆర్థికాభివృద్ధిని పెంపొందించే మొత్తం వృద్ధి కేంద్రీకృత మధ్యంతర బడ్జెట్ అన్నారు. ఇన్నోవేషన్ అండ్ గ్రీన్ టెక్నాలజీలను పెంచడానికి బయో మాన్యుఫ్యాక్చరింగ్ & రీసెర్చ్ ఫైనాన్సింగ్ సానుకూలంగా ఉందన్నారు.
ఇదే క్రమంలో కరోనా సమయంలో వ్యాక్సిన్లను భారీగా ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలకు అందించటంలో అత్యధికంగా కృషిచేసిన సీరమ్ సంస్థకు చెందిన అదార్ పూనావాలా బడ్జెట్ ప్రకటనను స్వాగతించారు. దేశంలోని 9-14 ఏళ్ల మధ్య ఆడపిల్లలకు సర్వైకల్ క్యాన్సల్ నుంచి రక్షణ కల్పించేందుకు ఉచితంగా టీకా అందించాలనే నిర్ణయాన్ని ప్రశంశించారు. ఇదే క్రమంలో స్నాప్ డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ భాల్ 2047 నాటికి వికసిత్ భారత్ వైపు ప్రభుత్వం అడుగులు వేయటాన్ని అభినందించారు.


Click it and Unblock the Notifications