Deloitte News: ఏళ్ల తరబడి కంపెనీకి సేవలందించి, సంస్థ అభివృద్ధి కోసం ఎంతగానో పాటుపడిన ఉద్యోగులకు కార్పొరేట్స్ మొండి చేయి చూపిస్తున్నాయి. వ్యక్తిగత జీవితాన్ని సైతం పణంగా పెట్టి పనిచేస్తే కాస్ట్ కటింగ్స్, గ్రోత్ ప్లాన్స్, ఆర్థిక మందగమనం మొదలైన వాటి పేరిట లేఆఫ్స్ ఇచ్చి బాయ్ చెబుతున్నాయి. కొలువు కోల్పోయిన తర్వాత నిరాశలోకి వెళ్లిపోయే వారు కొందరుంటే, ఆ బాధను తట్టుకుని అంతకు మించి పైకి ఎదిగినవారు ఎందరో ఉన్నారు. ఇలా తన జీవితంలో ఎదుర్కొన్న చేదు జ్ఞాపకాలను ఓ టెక్కీ బయటపెట్టింది. కార్పొరేట్ కల్చర్ దురాగతాన్ని కళ్లకు కట్టేలా ఉన్న ఈ కథనం ఇప్పుడు వైరల్‌గా మారింది.
చికాగోలోని డెలాయిట్‌లో పనిచేస్తున్న యాక్చురియల్ అనలిస్ట్ సియెర్రా డెస్‌మరాట్టి తన లేఆఫ్స్ అనుభవాన్ని పంచుకున్నారు. తనను తొలగించినట్లు HR తెలియజేసినప్పుడు ఎంతో బాధ పడినట్లు చెప్పారు. అది తనకు ఇష్టమైన ఉద్యోగం కానప్పటికీ 76 లక్షలు ఆర్జించే అవకాశం కోల్పోవడం పట్ల ఆందోళన చెందినట్లు తెలిపారు. ఎందుకంటే ఆ ఉద్యోగమే అప్పుడు తన మనుగడకు ఆధారంగా నిలిచిందన్నారు. కానీ ఏడాది తర్వాత ఆ తొలగింపు తనకు జరిగిన అత్యుత్తమ విషయాలలో ఒకటిగా పేర్కొన్నారు.

తక్కువ-ఆదాయ కుటుంబానికి చెందిన దేస్మరాట్టి సెప్టెంబరు 2022లో డెలాయిట్‌లో చేరారు. చుట్టూ ఉన్న సహోద్యోగులు టైట్ సూట్ జాకెట్‌లు మరియు డిజైనర్ వస్త్రాలను ధరించడం చూసి తాను అక్కడ ఉండాల్సిన వ్యక్తి కాదని భావించినట్లు చెప్పారు. 11 గంటల పాటు పనిచేయడం ప్రారంభించానని, మానసికంగా మరియు శారీరకంగాను అనారోగ్యం పాలయ్యానని తెలిపారు. రోజంతా కూర్చుని పనిచేయడం వల్ల వెన్ను నొప్పి భరిస్తూ, ఒత్తిడితో కూడిన అసైన్‌మెంట్‌లను పూర్తి చేసేందుకు స్నాక్స్‌పై ఆధారపడినట్లు వెల్లడించారు. కేవలం కొన్ని నెలల్లోనే 9 కిలోల బరువు పెరిగి ఎన్నడూ లేనంతగా అనారోగ్యంగా ఫీల్ అయినట్లు వివరించారు.
ఇంత చేసినా పనితీరు సమీక్ష సమయంలో తాను బాగా రాణించలేదని తన మేనేజర్ చెప్పడంతో ఒకింత ఆశ్యర్యానికి గురైనట్లు దేస్మరాట్టి గుర్తుచేసుకున్నారు. ఒకవేళ వారు ఆ విధంగా భావించినప్పుడే ఆ విషయం చెబితే తన పని విధానంలో మార్పులు చేసుకుని ఉండేదాన్నని ఆవేదన వ్యక్తం చేశారు. లేఆఫ్ గురించి HR కాల్ చేసిన తర్వాత రాత్రి తనకు నిద్ర పట్టలేదన్నారు. అకౌంట్‌లో కేవంల కొంచెం సేవింగ్స్ మాత్రమే ఉన్నాయన్నారు.
రెండు నెలల ఉద్యోగ వేట అనంతరం చివరకు ట్రాన్స్‌అమెరికాలో యాక్చురియల్ అనలిస్ట్‌గా రిమోట్ ఉద్యోగాన్ని పొందినట్లు దేస్మరాట్టి తెలిపారు. ఆ జాబ్ తనకు అనువైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ట్రాన్స్అమెరికాలో పని డెలాయిట్ మాదిరిగానే ఉంటుంది కానీ కంపెనీ సంస్కృతి భిన్నంగా ఉంటుందన్నారు. పనివేళలో మాత్రమే వర్క్ చేయమని తన ఉన్నతాధికారులు ఎప్పుడూ ప్రోత్సహిస్తారని చెప్పారు. తద్వారా తన అభిరుచులు మరియు సంబంధాలను పెంచుకోవడానికి సమయం దొరికినట్లు వెల్లడించారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications