బోర్డు మీటింగా అక్కడైతే బాగుంటుంది: కార్పొరేట్ కంపెనీల కొత్త ఆసక్తి.. ఏమిటో తెలుసా?

కార్పొరేట్ కంపెనీలను నడపాలంటే బోర్డు మీటింగ్ లు జరగాలి. అందులో తీసుకున్న నిర్ణయాల ప్రకారమే కంపెనీ ఉన్నతాధికారులు ఆయా కంపెనీలను ఏ మార్గం లో నడపాలో... ఉద్యోగులకు ఎలాంటి మార్గనిర్దేశకత్వం చేయాలో తేలుతుంది. అలాంటి బోర్డు మీటింగతులు ఇటీవల కాలంలో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. నూటికి తొంభై శాతం కార్పొరేట్ కంపెనీల బోర్డు మీటింగులు ఫైవ్ స్టార్ హోటల్స్ లో జరుగుతుంటాయి. చాలా సందర్భాల్లో కంపెనీ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉందొ ఆ సిటీ లోని హోటల్స్ లేదా సొంత కార్యాలయంలో బోర్డు మీటింగ్స్ నిర్వహిస్తారు. లేదంటే దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోని హోటల్స్ లో జరుగుతున్నాయి. కానీ ఈ మధ్య మన ఇండియన్ కంపెనీల డైరెక్టర్లు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఛార్టర్డ్ విమానాల్లో ఎగురుతూ, మంచు కొండల అందాలను వీక్షిస్తూ, లేదా కాలినడకన ఒక నగరాన్ని గైడ్ సహాయంతో చూస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీచ్ రిసార్టులోనూ, ఫుడ్ ఫెస్టివల్స్ లో పాల్గొంటూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ చేయని కొత్తదనాన్ని ఆస్వాదిస్తున్నారు.

ఎందుకలా...

ఎందుకలా...

ప్రస్తుత ప్రపంచం వేగవంతమై పోయింది. ఏదైనా ఒక ఐడియా, లేదంటే ఒక నిర్ణయం ఎక్కువ కాలం నిలదొక్కుకోవడం లేదు. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించాల్సిందే. కొత్త వ్యూహాలకు పదును పెట్టాల్సిందే. ఒకవైపు పోటీలో నిలదొక్కుకుంటూనే, మరోవైపు కంపెనీని నెంబర్ 1 గా ఉంచాలంటే కంపెనీ డైరెక్టర్లు, సీనియర్ మానేజ్మెంట్ కూడా కొత్తగా ఆలోచించాల్సిందే. అందుకే వారిని అడ్వెంచర్లు ట్రిప్ లకు, రేసులోకు తీసుకెళుతున్నారు. గాలిలో 30,000 ఫీట్ల ఎత్తులో హిమాలయాల అందాలను కాక్పిట్ నుంచి చూసే అవకాశం కల్పిస్తున్నారు. సాధారణంగా మనం విమానంలోని కాక్పిట్ లోకి ప్రవేశించలేము. కానీ ప్రైవేట్ జెట్ల లో ఆ సదుపాయం కల్పిస్తున్నారు. దాంతో మంచు పర్వతాల అందాలను చూస్తూ, కంపెనీ నెక్స్ట్ వ్యూహాన్నిఫిక్స్ చేస్తున్నారు.

స్టార్టప్ లూ సై అంటున్నాయి...

స్టార్టప్ లూ సై అంటున్నాయి...

ఇలాంటి బోర్డు మీటింగులకు చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. రూ వందల కోట్ల టర్నోవర్ ఉండే కంపెనీలు మాత్రమే ఆ ఖర్చును భరించగలవు. కానీ ఈ మధ్య ఫండింగ్ లభించిన చాలా స్టార్టుప్ కంపెనీలు కూడా వినూత్న ప్రదేశాల్లో తమ బోర్డు మీటింగులు నిర్వహిస్తున్నట్లు ట్రావెల్ ఏజెన్సీలు వెల్లడిస్తున్నాయి. బాగా ఫేమస్ ఐన న్యూ యార్క్, లండన్ వంటి మహా నగరాల్లో కాకుండా అంతగా పరిచయం లేని కొత్త నగరాలకు వెళ్లిపోతున్నారు. పైగా అక్కడ వీధుల్లో నడుస్తూ, స్థానిక వంటలను రుచిచూస్తూ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. చూసే వారికి అదొక పర్యటన మాత్రమే అనిపిస్తుంది. కానీ వారికీ మాత్రమే తెలుసు అక్కడ భవిష్యత్ కు సంబంధించిన ఎంత సీరియస్ వ్యూహాలకు పదునుపెడుతున్నారో.

10 లక్షల కంపెనీలు, 25 లక్ష డైరెక్టర్లు...

10 లక్షల కంపెనీలు, 25 లక్ష డైరెక్టర్లు...

మన దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉన్నప్పటికీ కంపెనీలు, అందులో పనిచేసే డైరెక్టర్ల సంఖ్య తక్కువేనని చెప్పాలి. మొత్తమ్మీద ఇండియా లో 10 లక్షల నుంచి 12 లక్షల ఆక్టివ్ కంపెనీలు ఉన్నాయి. సుమారు 25 లక్షల మంది డైరెక్టర్లు పనిచేస్తున్నారు. కానీ ఇలాంటి సాహసోపేతమైన, కొత్త తరహా బోర్డు మీటింగ్స్ నిర్వహించే కంపెనీల సంఖ్య చాలా తక్కువే. రూ 100 కోట్లు ... ఆ పైన టర్నోవర్ కలిగిన కంపెనీలు ఇలాంటి వాటికి ముందుకు వస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, ఫైనాన్స్, ఇన్సూరెన్సు , బ్యాంకింగ్ వంటి రంగాలకు చెందిన కంపెనీలు ఎక్కువగా అడ్వెంచర్ బోర్డు మీటింగ్స్ నిర్వహిస్తున్నట్లు పర్యాటక ఏజెన్సీ లు చెబుతున్నాయి.

పిక్ నిక్ లా...

పిక్ నిక్ లా...

ఇలాంటి బోర్డు మీటింగ్స్ చాలా వరకు పిక్ నిక్ లా గడిచిపోతున్నాయి. అయ్యో తాము చాలా సీరియస్ డెసిషన్ తీసుకుంటున్నాం కదా... ఒక గదిలో నాలుగు చైర్స్ వేసుకుని గంటలు గంటలు చర్చించుకోవాలి అన్న పంథాను వీరు పూర్తిగా వదిలేస్తున్నారు. చక్కగా పిక్ నిక్ లా ఒకరికి ఒకరు వడ్డించుకుంటూ ఒక చాకు లాంటి ఐడియా ను విసురుతున్నారు. మరొకరు స్వయంగా వంట చేసి తమ కుకింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూనే... వ్యూహానికి పదును పెడుతూ అలరిస్తున్నారు. డాన్స్ లు, పాటలు పాడుతూ సరదాగా గడిపేస్తున్నారు. ఇలా ఉల్లాసభరితమైన వాతావరణంలో మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది కాబట్టి, మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది అని మానసిక ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు. ఒత్తిడికి దూరంగా ప్రశాంతమైన వాతావరణం ఐక్యూ లెవెల్స్ పెంచుతున్నట్లు చెబుతున్నారు. మరో వైపు బోర్డు మీటింగ్స్ లో చూసిన సరికొత్త ప్రదేశాలకు వెళ్లి డైరెక్టర్లు మరోసారి తమ కుటుంబ సభ్యులతో హాలిడేస్ స్పెండ్ చేసేందుకు కూడా ఇష్టపడుతున్నట్లు ఏజెన్సీలు చెబుతున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+