కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా కుబేరులు పెద్ద ఎత్తున నష్టపోయారు. చైనాలో పుట్టిన ప్రాణాంతక కరోనా భయంతో అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలుతున్న విషయం తెలిసిందే. చైనా నుండి ఇది ఇతర దేశాలకు పాకుతోంది. దీంతో మార్కెట్లు కుప్పకులి, ప్రపంచ సంపన్నుల ఆస్తులు తరిగిపోతున్నాయి. ప్రపంచ టాప్ 500 ధనికుల సంపద ఏకంగా 444 బిలియన్ డాలర్ల మేర హరించుకుపోయింది.

50 బిలియన్ డాలర్లు కోల్పోయిన ఐదుగురు టాప్ రిచ్
కరోనా వైరస్ కారణంగా మార్కెట్లు భారీగా నష్టపోవడంతో గత వారం జెఫ్ బెజోస్ 11.9 బిలియన్ డాలర్ల సంపద, బిల్ గేట్స్ 10 బిలియన్ డాలర్ల సంపద, బెర్నార్డ్ అర్నాల్ట్ 9.1 బిలియన్ డాలర్ల సంపద, ఎలాన్ మస్క్ 9 బిలియన్ డాలర్ల సంపద, వారెన్ బఫెట్ 8.8 బిలియన్ డాలర్ల సంపద హరించుకుపోయింది. ఈ ఐదుగురే దాదాపు 50 బిలియన్ డాలర్ల మేర సంపదను కోల్పోయారు.

వీరి సంపాదనే అధికం
అమనికో ఓర్టేజా 6.8 బిలియన్ డాలర్ల సంపద, మార్క్ జుకర్‌బర్గ్ 6.6 బిలియన్ డాలర్ల సంపద, లారీ పేజ్ 6.4 బిలియన్ డాలర్ల సంపద, కార్లోస్ స్లిమ్ 6.3 బిలియన్ డాలర్ల సంపద, సెర్జీ బ్రిన్ 6.2 బిలియన్ డాలర్ల సంపదన కోల్పోయారు. వీరి ఐదుగురు సంపాదన దాదాపు 39 బిలియన్ డాలర్ల మేర హరించుకుపోయింది. అంటే నష్టపోయిన టాపర్ టెన్ బిలియనీర్ల హరించుకుపోయిన సంపాదన దాదాపు 90 బిలియన్ డాలర్లు.

సంపాదించినదంతా హాంఫట్
ప్రపంచ టాప్ 500 కుబేరుల సంపద 444 బిలియన్ డాలర్లు హరించుకుపోయింది. డౌజోన్స్‌లో 30 పెద్ద కంపెనీల సంపద 12 శాతం మేర పడిపోయింది. 2008 తర్వాత వరుసగా ఐదు రోజులు నష్టపోవడం మళ్లీ ఇదే తొలిసారి. టాప్ 500 మంది కుబేరులు ఏడాది కాలంలో 78 బిలియన్ డాలర్లు సంపాదించారు. కానీ కరోనా వైరస్ కారణంగా ఇదంతా కొద్ది రోజుల్లోనే కోల్పోయారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications