For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

COVID 19: వేతనాలు ముందే ఇచ్చిన కొటక్ మహీంద్రా, ఎన్నో జాగ్రత్తలు

|

కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటోంది. కంపెనీలు కూడా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. మహింద్రా గ్రూప్‌కు చెందిన కొటక్ మహీంద్రా బ్యాంకు తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆ బ్యాంకుల శాఖల్లోని కాంటాక్ట్ సెంటర్‌లలో పరిమిత సంఖ్యలో ఉద్యోగులు పని చేస్తున్నారు. కస్టమర్లు తమ ఇళ్ల నుండే మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ సేవలు వినియోగించుకోవాలని సూచిస్తోంది.

ముఖేష్ అంబానీ మార్చి టార్గెట్, జియోలో ఫేస్‌బుక్ 10% వాటాముఖేష్ అంబానీ మార్చి టార్గెట్, జియోలో ఫేస్‌బుక్ 10% వాటా

బ్యాంకు వేళల్లో మార్పులు

బ్యాంకు వేళల్లో మార్పులు

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు బ్యాంకుల్లో సిబ్బందిని పరిమితం చేశారు. 20 మార్చి 2020 నుండి కొటక్ మహీంద్రా బ్యాంకులు కేవలం ఉదయం గం.10 నుండి మధ్యాహ్నం గం.2 వరకు మాత్రమే తెరిచి ఉంటున్నాయి. సాధ్యమైన ప్రతిచోట వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చింది. ఉద్యోగులకు రిమోట్ యాక్సెస్ సౌకర్యం కల్పించేందుకు సంస్థకు సురక్షిత యంత్రాంగం ఉంది. ఇది భద్రతా ప్రోటోకాల్‌కు ఇబ్బందుల్లేకుండా ఉంటుంది.

 శానిటైజర్లు, మాస్కులు

శానిటైజర్లు, మాస్కులు

కార్యాలయాలు, బ్యాంకుల్లో పని చేసే ఉద్యోగుల రక్షణ కోసం శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచారు. వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన ఆరోగ్య సలహాలు అనుసరింప చేస్తున్నారు. అవసరమైనచోట శానిటైజేషన్ చేస్తున్నారు.

వైద్య పరీక్షలు

వైద్య పరీక్షలు

ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అందరు కూడా కరోనా వైరస్ టెస్ట్ చేయించుకోవాలని సూచించింది. ప్రయివేటు ల్యాబ్‌లలో అయ్యే ఖర్చు రీయింబర్సుమెంట్ ఇస్తామని ప్రకటించింది. అంతేకాదు, ఈసారి వేతనాలు కూడా ముందే అందిస్తోంది. ఈ రోజే (మార్చి 26) కొటక్ ఉద్యోగుల చేతికి వేతనాలు రానున్నాయి.

English summary

COVID 19: వేతనాలు ముందే ఇచ్చిన కొటక్ మహీంద్రా, ఎన్నో జాగ్రత్తలు | coronavirus test: Kotak Mahindra to reimburse employees, family members

Kotak has announced that all employees or immediate family members that are advised to go for COVID-19 testing will have the cost of the test done through private labs reimbursed to them. The Group will also be paying salaries earlier this month i.e. 26th March 2020.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X