కరోనా వైరస్, ఈ మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు లాక్ డౌన్, రాబోయే క్వార్టర్‌లో కార్పోరేట్ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రతికూల ప్రభావం నేపథ్యంలో లిస్టెడ్ నాన్ ఫైనాన్షియల్ కంపెనీల దాదాపు రూ.15 ట్రిలియన్ల విలువైన రుణాలు రిస్క్‌లో ఉన్నాయని అంచనా. మీడియాలో వస్తున్న సమాచారం మేరకు 201 నాన్ ఫైనాన్షియల్ లిస్టెడ్ కంపెనీలు 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ సంవత్సరంలో తమ ఆర్థిక స్థితిలో తీవ్ర క్షీణతను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇబ్బందులు ఉంటాయని చెబుతున్నారు.

రూ.15 ట్రిలియన్లు ప్రమాదంలో..
కరోనా కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు స్టాక్ ఎక్సేంజీలో నమోదైన నాన్-ఫైనాన్సియల్ కంపెనీలన్నీ పెద్ద మొత్తంలో రుణాలు పొందాయి. దీంతో రూ.15 ట్రిలియన్ల రుణాలు ప్రమాదంలో ఉన్నాయని చెబుతున్నారు.

వడ్డీ రూ.35,000 కోట్లు
కరోనా కారణంగా జనజీనం స్తంభించింది. కార్పొరేట్ కంపెనీలు మూతబడ్డాయి. దీంతో ఆయా కంపెనీలు తీసుకున్న రుణాలు చెల్లింపు గడువును మూడునెలలు పెంచుతూ ఆర్బీఐ మారటోరియం విధించింది. దీంతో కంపెనీల నుంచి రావాల్సిన రుణాల వడ్డీ మొత్తం రూ.35,000 కోట్ల ఆగిపోనున్నాయట. రాబోయే త్రైమాసికాలలో 201 కంపెనీల ఆర్థిక స్థితిగతులు క్షీణించి 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ సంవత్సరంలో ఆదాయాలు భారీగా తగ్గుతాయని బిజినెస్ స్టాండర్డ్ తెలిపింది.

ఈ సంస్థలకు ఆర్థిక ఒత్తిడి
బీఎస్ఈ 500, బీఎస్ఈ మిడ్ క్యాప్ లేదా బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లోని కంపెనీలపై విశ్లేషణ జరపగా.. ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, అదానీ పవర్స్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, యూపీఎల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వంటివి రాబోవు క్వార్టర్‌లో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో 201 కంపెనీలు నికర వ్యాల్యూ, ఈబీఐటీడీఏ, ఈక్విటీ నిష్పత్తులు నెగిటివ్‌గా ఉన్నట్లు గుర్తించింది. ఈ కంపెనీలు రూ.14.9 ట్రిలియన్లు బాకీపడ్డాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇది 4.1 శాతానికి పెరిగింది.

రుణాలు ఎంతగా ఉన్నాయంటే..
787 కంపెనీలు తీసుకున్న మొత్తం రుణాలు 2019 సెప్టెంబర్ చివరి నాటికి రూ.24.2 ట్రిలియన్లుగా ఉంది. అంతకుముందు ఏడాది రూ.17.1 ట్రిలియన్లుగా ఉంది. ఇదే సమయానికి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పోరేషన్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్సుపోర్ట్ ఫైనాన్స్, ఎల్ఐసీ హౌసింగ్, ఇండియాబుల్స్ హౌసింగ్, పిరమిల్ ఎంటర్‌ప్రైజెస్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ సంస్థల రుణాలు రూ.24.3 ట్రిలియన్లుగా ఉంది.

ఆదాయాలు తగ్గుతాయని హెచ్చరికలు
ఆర్బీఐ మూడు నెలల మారటోరియం నేపథ్యంలో కంపెనీలు చెల్లించాల్సిన రూ.35,000 కోట్లు నిలిచిపోనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల కాలంలో చెల్లించాల్సిన రూ.1.48 ట్రిలియన్ల వడ్డీ ఉంది. లాక్ డౌన్ నేపథ్యంలో ట్రాన్సాక్షన్స్ నిలిచిపోయి ఆయా కంపెనీలకు రావాల్సిన నికర ఆదాయం 9 శాతం మేర తగ్గనుంది. ఎక్స్చేంజ్‌లో లిస్టైన నాన్ ఫైనాన్షియల్ కంపెనీలు విక్రయాలపై 3.5 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. లాక్ డౌన్ నేపథ్యంలో వివిధ కంపెనీల ఆదాయాలు తగ్గుతాయని రేటింగ్ ఏజెన్సీలు చెబుతున్నాయి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications