కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా రెండు వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. దాదాపు లక్ష మందికి సోకింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మాస్క్‌లకు డిమాండ్ పెరిగింది. కరోనా ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ఉండగా, కొన్ని వస్తువులకు మాత్రమే డిమాండ్ పెరిగింది. బంగారం వంటి అతి విలువైన లోహాలపై పెట్టుబడులు పెట్టడంతో వాటి డిమాండ్ పెరిగింది. ఈ వ్యాధి నుండి కాపాడుకోవడానికి ఉపయోగించే మాస్క్ ధరలు కూడా పెరిగాయి. అలాగే, మాస్క్ కంపెనీల షేర్లు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి.
కరోనా వైరస్ ప్రభావం.. మరిన్ని బిజినెస్ న్యూస్

భారీగా పెరిగిన మాస్క్ ధరలు..
మార్కెట్లో తగినంతగా మాస్క్‌లు లేవని, ధరలు ఎక్కువో.. తక్కువో తీసుకుంటే తీసుకోండి లేదంటే లేదు అని దుకాణదారులు ఖరాఖండిగా చెబుతున్నారు. సర్జికల్ మాస్క్స్ ధరలు ఏకంగా 300 శాతం పెరిగాయి. రూ.10 మాస్క్‌ను రూ.40కి విక్రయిస్తున్నారు. N95 మాస్క్, శానిటైజర్స్ ధరలు కూడా భారీగా పెరిగాయి.

అధిక ధరలకు స్టాక్స్..
చైనా నుండి ఉత్పత్తి ఆగిపోవడంతో స్థానిక దుకాణదారులు తమ వద్ద ఉన్న స్టాక్స్ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. హెల్త్ వర్కర్స్‌కు కూడా మాస్క్‌ల సరఫరా కొరత ఉంది. హెల్త్ కేర్ సిబ్బంది నేరుగా కరోనా వైరస్ సోకిన పేషెంట్లతో టచ్‌లో ఉంటారు. వారికి వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువ. అలాంటి వారికి వెంటనే మాస్క్‌లు అందించాల్సి ఉందని చెబుతున్నారు.

వారు మాస్క్‌లు ధరించొద్దు..
కరోనా వైరస్ ప్రభావం లేకుంటే, ఆరోగ్యంగా ఉంటే.. అలాంటి వారు మాస్క్‌లు ధరించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఎవరైతే రెస్పిరేటరీ ఇల్‌నెస్‌తో బాధపడతారో వారికి, అలాగే హెల్త్ కేర్ వర్కర్స్‌కు అందించేలా చూడాలని సూచిస్తున్నారు. మాస్క్‌ల కొరత ఉన్నందున, వారికి వదిలేయాలంటున్నారు.

హైదరాబాద్‌లో మాస్క్‌లకు రెక్కలు..
హైదరాబాదులో కరోనా కేసు నమోదు కావడంతో మాస్కుల ధరలకు రెక్కలు వచ్చాయి. రెండు లేయర్స్ కలిగిన మాస్క్ హోల్ సేల్ ధర రూ.1.60 కాగా, కొంతమంది దుకాణదారులు వీటిని రూ.20 నుండి రూ.25, రూ.30 నుండి రూ.40 మధ్య విక్రయిస్తున్నారు. N95 మాస్క్ ధర రూ.300 వరకు ఉంది.

కృత్రిమ కొరత..
మాస్క్‌ల కొరత లేదని ప్రభుత్వం చెబుతోంది. కానీ వ్యాపారులు మాత్రం ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఆసుపత్రుల వద్ద మాస్క్‌లకు భారీ డిమాండ్ ఏర్పడింది. జనరిక్ దుకాణాల్లోను సాధారణ మాస్క్‌లకు రూ.20 వరకు తీసుకుంటున్న సందర్భాలు ఉన్నాయని చెబుతున్నారు. కరోనా వైరస్ కారణంగా డిమాండ్ నేపథ్యంలోకృత్రిమ కొరత సృష్టిస్తుండవచ్చునని భావిస్తున్నారు.

నిన్నటి దాకా రూ.160.. ఇప్పుడు రూ.1600
గతంలో 100 మాస్క్‌లు ఉన్న ఓ ప్యాకెట్ ధర రూ.160గా ఉంది. ఇప్పుడు దానిని రూ.1,600కు విక్రయిస్తున్నారట. తక్కువ ధరకు అడిగితే లేవని చెప్పే పరిస్థితులు. ప్రభుత్వాలు ధరలను నియంత్రించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications