కరోనా దెబ్బకు 5 బిలియన్ డాలర్ల ముఖేష్ అంబానీ సంపద ఆవిరి: అదానీ, ప్రేమ్‌జీ, టాటా కూడా
కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయంగా, దేశీయంగా కుబేరుల ఆస్తులు భారీగా కరిగిపోయాయి. దాదాపు రెండు నెలలుగా కరోనా వైరస్ భయకంపితులను చేస్తోంది. దీంతో మార్కెట్లు భారీ నష్టాల్లో మునిగిపోతున్నాయి. దీంతో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ నుండి ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ వరకు సంపద కరిగిపోయింది. మన దేశంలో ముఖేష్ అంబానీ, అజీమ్ ప్రేమ్ జీ, అదానీ ఆస్తులు పెద్ద మొత్తంలో కరిగిపోయాయి.

హరించిన సంపద
దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఫిబ్రవరి చివరి వారంలో భారీగా నష్టపోయాయి. గత ఆరు సెషన్లలో వరుస నష్టాలు ఇన్వెస్టర్ల సంపదను హరించాయి. ఇన్వెస్టర్ల సంపద రూ.10 లక్షల కోట్లు ఆవిరైంది. శుక్రవారం ఒక్కరోజే రూ.4 లక్షలకు పైగా సంపద కరిగిపోయింది. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగారు. దీంతో కుబేరులు సంపదను కోల్పోయారు.

హరించుకుపోయిన ముఖేష్, ప్రేమ్‌జీ, అదానీ ఆస్తులు..
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ సూచీ ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తన సంపదలో 5 బిలియన్ డాలర్లను కోల్పోయారు. అజీమ్ ప్రేమ్‌జీ సంపద 869 మిలియన్ డాలర్లు, అదానీ సంపద 469 మిలియన్ డాలర్లు హరించుకుపోయింది.

రిలయన్స్ మార్కెట్ క్యాప్ ఎంత తగ్గిందంటే
శుక్రవారం సెన్సెక్స్ దాదాపు 1450 పాయింట్లు నష్టపోవడంతో ఆసియాలోని టాప్ 15 మంది బిలియనీర్ల సంపద 53.5 బిలియన్ డాలర్ల సంపద కరిగిపోయింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాప్‌లో ఉన్న రిలయన్స్ షేర్ ధర 4.12 శాతం తగ్గి రూ.1328కి చేరుకుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 8.4 లక్షల కోట్లకు తగ్గింది.

మరిన్ని కంపెనీలు..
ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా 884 మిలియన్ డాలర్ల సంపద కోల్పోయింది. విప్రో షేర్లు 4.53%, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 6.5% నష్టపోయాయి. TCS, HDFC, ఇన్ఫోసిస్ షేర్లు 2.5-3.5% మధ్య, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ షేర్లు 4 నుండి 5% మధ్య కుప్పకూలాయి.

3000 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
ఫిబ్రవరి 12 నుండి రిలయన్స్ షేర్లు 13 శాతం, నెట్ వర్క్ 18 షేర్లు 6 శాతం, టీవీ 18 బ్రాడ్ కాస్ట్ 7 శాతం, డెన్ నెట్ వర్క్స్ 2 శాతం పడిపోయాయి. టాటా గ్రూప్ రూ.41,930 కోట్లు నష్టపోయింది. ఫిబ్రవరి 12వ తేదీ నుండి గత 11 సెషన్లలో సెన్సెక్స్ 3,000 పాయింట్లు నష్టపోయింది. ఇది తలాల్ స్ట్రీట్‌లో ఇన్వెస్టర్ల సంపదను 11.52 లక్షల కోట్లు హరించింది.


Click it and Unblock the Notifications