చైనాలో పుట్టిన కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఎకానమీపై ఈ ఏడాది 2 ట్రిలియన్ డాలర్ల మేర ప్రభావం పడనుందని ఐక్య రాజ్య సమితి ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ వెల్లడించింది. కరోనా వివిధ దేశాలకు వ్యాప్తి చెందడంతో ప్రపంచ వృద్ధి రేటు 2.5 శాతం కంటే తక్కువకు పడిపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా వైరస్ దెబ్బ, మరిన్ని కథనాలు

అగ్రదేశాలకు ముచ్చెమటలు
కరోనా వైరస్ అగ్రదేశాలకు కూడా ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ సంవత్సరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 2% మందగమనాన్ని చూస్తామని ఐరాస వాణిజ్య, అభివృద్ధి విభాగంలో ప్రపంచీకరణ, అభివృద్ధి వ్యూహాల శాఖ డైరెక్టర్ రిచర్డ్ కోజుల్ రైట్ అన్నారు. కరోనా కారణంగా నాలుగువేల మందికి పైగా చనిపోయారు. లక్షమందికి పైగా బాధితులు ఉన్నారు. వందకు పైగా దేశాలకు విస్తరించింది. ప్రాణాలతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనూ ఇది మింగేస్తోంది.

చైనా మినహా అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రభావం ఎంతంటే
ఈ క్రమంలోనే కనిష్ఠంగా 1 ట్రిలియన్ డాలర్లు గరిష్ఠంగా 2 ట్రిలియన్ డాలర్ల మేర ప్రపంచ ఆదాయం క్షీణించవచ్చని అంచనా వేసింది. ఇందులో చైనా మినహా మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో క్షీణించే ఆదాయం 220 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది.

క్రూడాయిల్ సహా..
కరోనా వైరస్ కారణంగా ముఖ్యంగా చమురుపై ఆధారపడే దేశాలు, కంపెనీలు భారీగా నష్టపోయాయి. కమొడిటీ ఎగుమతులపై ప్రభావం చూపింది. వీటితో సంబంధం ఉన్న వ్యాపారాలు అన్నీ దెబ్బతిన్నాయి. వ్యాపార, పారిశ్రామిక రంగాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. కర్మాగారాలు మూతబడ్డాయి. ఉత్పత్తి నిలిచిపోయింది.

చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం
కరోనా కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే తీవ్రస్థాయిలో నష్టపోయింది. ఇటలీ, సౌత్ కొరియా తదితర దేశాలపై కరోనా ప్రభావం ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలోనే చైనాయేతర అభివృద్ధి చెందుతున్న దేశాల ఆదాయం 220 బిలియన్ డాలర్లు పడిపోవచ్చునని ఐరాస ఏజెన్సీ పేర్కొంది.

భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
భారత ఆర్థిక వ్యవస్థకు 348 మిలియన్ డాలర్ల (రూ.2,569 కోట్లు) నష్టం ఉండవచ్చునని అంచనా వేసింది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలను కూడా కరోనా కుదిపేస్తోంది. కెనడా, మెక్సికో, సెంట్రల్ అమెరికన్ రీజియన్, తూర్పు, దక్షిణాసియా దేశాలు, యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు కరోనాతో ప్రభావిమవుతున్నాయి. ఈ దేశాల్లో 0.7% నుంచి 0.9% మేర వృద్ధిరేటు పడిపోయే అవకాశముంది.

చైనా అతిపెద్ద వినియోగదారు
క్రూడాయిల్ ఉత్పత్తి చేసే దేశాలపై భారీగా ప్రభావం పడింది. చైనా ముడి చమురు వినియోగం భారీగా పడిపోయింది. ప్రపంచ ముడి చమురు వినియోగదారుల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గి క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి. బ్యారెల్ ధర 30 డాలర్లకు కూడా వచ్చింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications