ముంబై: స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతోంది. గత వారం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు.. ఈ వారం కూడా భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సోమవారం (మార్చి 16) ఉదయం గం.9.18 సమయానికి సెన్సెక్స్ 1,520.53 పాయింట్లు (4.46 శాతం) నష్టపోయి 32582.95 పాయింట్ల వద్ద, నిఫ్టీ 440.60 (4.43 శాతం) నష్టపోయి 9514.60 వద్ద ట్రేడ్ అయింది. ఓ సమయంలో 2,000 పాయింట్లు పడిపోయింది. ఆ తర్వాత 1500 వద్ద కనిపించింది. 190 షేర్లు లాభాల్లో, 730 షేర్లు నష్టాల్లో ఉండగా, 62 షేర్లలో ఎలాంటి మార్పులేదు.
కరోనా వైరస్ దెబ్బకు మార్కెట్లు అతలాకుతలం

యస్ బ్యాంకు 40 శాతం జూమ్
యస్ బ్యాంకు భారీగా పుంజుకుంది. ఏకంగా దాదాపు 40 శాతం ఎగిసింది. HDFC, ICICI బ్యాంకు, SBI, సన్ ఫార్మా, JSPL, మ్యాక్స్ ఫైనాన్షియల్, DLF నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. టాప్ గెయినర్స్ జాబితాలో ఒక యస్ బ్యాంకు మాత్రమే ఉంది. టాప్ లూజర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకు ఉన్నాయి.

ఎస్బీఐ కార్డ్స్
ఎస్బీఐ కార్డ్స్ ప్రీ ఓపెన్ రూ.661 వద్ద ప్రారంభమైంది. ఎస్బీఐ కార్డ్స్ లిస్టింగ్ సమయంలో ఎస్బీఐ షేర్లు కూడా 8 శాతం మేర నష్టపోయాయి. కరోనా వైరస్ ప్రభావం ఎస్బీఐ కార్డ్స్ లిస్టింగ్ పైన కూడా పడుతోంది.

మార్కెట్లకు కరోనా దెబ్బ
కరోనా వైరస్ దెబ్బతో గతవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. గత సోమవారం 3వేల పాయింట్లు, గురువారం అంతే మొత్తంలో నష్టపోయిన సెన్సెక్స్ శుక్రవారం కూడా 3వేల పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. కానీ సాయంత్రానికి కాస్త కోలుకొని లాభాల్లో ముగిసింది. వారాంతంలో లాభాల్లో ముగిసినప్పటికీ.. మొత్తంగా గత వారం మాత్రం భారీ నష్టాలను చవి చూశాయి.
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 6 వేల మందికి పైగా మృత్యువాత పడగా, లక్షన్నర మందికి పైగా సోకింది. భారత్‌లో కరోనా సోకిన వారి సంఖ్య 110కి చేరుకుంది. ఇద్దరు మృతి చెందారు. ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతుండటంతో ఈ ప్రభావం భారత మార్కెట్లపై కూడా పడుతోంది.
More From GoodReturns

Stock Market: సెన్సెక్స్ టాప్ లూజర్స్ ఇవే.. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలా, లేక ఇన్వెస్ట్ చేయాలా?

Stock market: ఐటీ స్టాక్స్ క్రాష్! నిఫ్టీ ఐటీ ఇండెక్స్ డౌన్.. భారీ నష్టాల్లో టాప్ కంపెనీలు!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?



Click it and Unblock the Notifications