పర్యాటక రంగంపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం
పర్యాటక రంగంపై కరోనా వైరస్ ప్రభావం చాలానే ఉంది. వేల కోట్ల ప్రభావం పడుతోంది. దీనిపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ స్పందించారు. కరోనా ప్రభావం పర్యాటక రంగంపై బాగా ఉందని, ఇది అందరికీ తెలుసునని, ఈ రంగానికి వచ్చే నష్టాల గురించి పూర్తి అధ్యయనం అనంతరం ఏదైనా ప్యాకేజీ ప్రకటించే అంశాన్ని నిర్ణయిస్తామన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలు ఆర్థిక ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో క్రిసిల్ రేటింగ్ ఓ ప్రకటన చేసింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎయిర్ లైన్స్, హోటల్స్, మాల్స్, మల్టీప్లెక్స్, రెస్టారెంట్లు, రిటైలర్లకు స్వల్ప, మధ్యకాలిక ఆర్థిక సాయం వెంటనే అందించాలని క్రిసిల్ తన నివేదికలో సూచించింది.

చైనాలో కొత్తగా కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో మే చివరినాటికి సరఫరా వ్యవస్థ సాధారణ స్థితికి వచ్చే అవకాశముందని తెలిపింది. ఇది జరగకుంటే స్టీల్, జెమ్స్, జువెల్లరీ, కన్స్ట్రక్షన్స్, ఇంజనీరింగ్, టెక్స్‌టైల్ రంగాలు కరోనా బారిన పడతాయని హెచ్చరించింది.
కరోనా కారణంగా 80 శాతం కంపెనీలకు నగదు రాక తగ్గినట్లు ఫిక్కీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. కరోనాతో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని, డిమాండ్, సరఫరా దెబ్బతిన్నదని పేర్కొంది. ఉద్యోగుల వేతనాలు, వడ్డీ, రుణ చెల్లింపులపై ప్రభావం ఉంటుందని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆర్బీఐ పాలసీ రేట్లను 100 బేసిస్ పాయింట్లు తగ్గించాలని కూడా ఫిక్కీ కోరింది.


Click it and Unblock the Notifications