కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్లోబల్ టూరిజం మాత్రమే కాదు, దేశీయ పర్యాటక రంగం కూడా కుదేలవుతోంది. చాలా దేశాలు విదేశీ పర్యాటకులపై ఆంక్షలు విధించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా వీసాలపై నెల రోజుల పాటు నిషేధం విధించడంతో దేశీయంగా కూడా పర్యాటకం, విమానయాన రంగాలు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.
మరోవైపు కరోనా వైరస్ భయంతో ప్రజలు స్వచ్ఛందంగా తమ ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. ఫలితంగా ఈ మధ్య కాలంలో దేశీయ విమానయానం 15 శాతం వరకు తగ్గిపోయినట్లు అంచనా. ఇదే పరిస్థితి మరికొన్నాళ్లు కొనసాగితే బ్రిటన్ ఎయిర్‌లైన్స్ 'ఫ్లైబీ' మాదిరిగానే దేశీయ విమానయాన సంస్థలు కుప్పకూలే ప్రమాదం లేకపోలేదు.
ఈ నేపథ్యంలో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు దేశీయ, విదేశీయ విమానయాన సంస్థలు కొత్త కొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్‌కు సంబంధించిన గతంలో చేసుకున్న బుకింగ్ డేట్స్‌ను రీషెడ్యూల్ చేసుకుంటే ఛార్జీలను విధించడం లేదు. అలాగే కొన్ని విమానయాన సంస్థలు క్యాన్సిలేషన్ ఛార్జీలను కూడా తీసుకోవడం లేదు.

వీసాల రద్దుతో రూ.8500 కోట్లు నష్టం...
కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నెల రోజులపాటు వీసాల రద్దు నిర్ణయం దేశీయ టూరిజం, ఏవియేషన్ రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ రంగాలు రూ.8500 కోట్లు నష్టపోయే ప్రమాదమున్నట్లు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్(ఏఐటీవో), అసోచాం వంటి పరిశ్రమల సమాఖ్యలు పేర్కొంటున్నాయి. నిజానికి కరోనా వైరస్ ప్రబలిన తరువాత కూడా కొంత కాలంపాటు విమానయాన సంస్థలు ఆయా దేశాలకు, దేశీయంగా విమానాలు నడిపాయి. దీంతో నిర్వహణ ఖర్చులతోపాటు సిబ్బందికి జీతభత్యాలు ఇచ్చేందుకు అవసరమైన నిధులు ఆయా సంస్థలకు సమకూరేవి. అయితే వీసాలపై నెల రోజుల నిషేధం అమలులోకి రావడంతో విమానయాన రంగం పూర్తిగా వెలవెలబోతోంది. దీంతో ఆయా విమానయాన సంస్థలు ఖర్చులు, జీతాలు భరించలేక సిబ్బందిని కూడా తగ్గించుకోవడం మొదలెట్టాయి. కొత్త రిక్రూట్‌మెంట్‌ను కూడా నిలిపివేశాయి.

దేశీయ విమానయానం ఢమాల్...
కరోనా వైరస్ భయంతో ప్రజలు స్వచ్ఛందంగా తమ ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. ఫలితంగా ఈ మధ్య కాలంలో దేశీయ విమానయానం 15 శాతం వరకు తగ్గిపోయినట్లు అంచనా. ముఖ్యంగా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి రాకపోకలు చాలావరకు తగ్గిపోయాయి. గతంలో విమాన టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు కూడా తమ ప్రయాణాన్ని ఆఖరి నిమిషంలో రద్దు చేసుకుంటున్నారు. దేశీయ విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్యాసింజర్ల సంఖ్య గతంలో రోజుకు 70 వేలు ఉండేది. అది ప్రస్తుతం 62 వేలకు పడిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ సంఖ్య 40 వేలకు కూడా పడిపోవచ్చు. ఇప్పటికే బెంగళూరులోని కెంపె గౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల సంఖ్య సగానికి పడిపోయింది. ఇదే పరిస్థితి మరికొన్నాళ్లు కొనసాగితే బ్రిటన్ ఎయిర్‌లైన్స్ ‘ఫ్లైబీ' మాదిరిగానే దేశీయ విమానయాన సంస్థలు కుప్పకూలే ప్రమాదం లేకపోలేదు.

ఓల్వో బస్సు టిక్కెట్ ధరకే...
ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో దేశీయ విమానయాన రంగం స్థితి దీనంగా మారింది. ఒకవైపు కరోనా వైరస్ భయంతో ఆయా దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో.. ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయి పలు విమానాలు రద్దు అవుతున్నాయి. దీంతో కనీసం నిర్వహణ ఖర్చులైనా రాబట్టుకునేందుకు అంతర్జాతీయ, దేశీయ విమానయాన సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని మార్గాల్లో విమాన ప్రయాణానికి అయ్యే ఖర్చు ఓల్వో బస్సులో ప్రయాణానికి అయ్యేంతగా తగ్గిపోయింది. చెన్నై నుంచి బెంగళూరుకు వోల్వో బస్సులో ప్రయాణిస్తే.. టికెట్ ధర రూ.1,100 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే ధరకు పలు విమానయాన సంస్థల నుంచి విమాన టికెట్ లభిస్తోంది. ఇంకా మరికొన్ని మార్గాలలోనూ విమాన టిక్కెట్ల ధరలు పడిపోయాయి.

ఎయిర్‌లైన్స్ కొత్త ఆఫర్లు...
ఈ నేపథ్యంలో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు దేశీయ, విదేశీయ విమానయాన సంస్థలు కొత్త కొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్‌కు సంబంధించిన గతంలో చేసుకున్న బుకింగ్ డేట్స్‌ను రీషెడ్యూల్ చేసుకుంటే ఛార్జీలను విధించడం లేదు. అలాగే కొన్ని విమానయాన సంస్థలు క్యాన్సిలేషన్ ఛార్జీలను కూడా తీసుకోవడం లేదు. ఇప్పటికే ఇండిగో, ఎయిర్ ఏషియా, స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్, గో ఎయిర్ సంస్థలు ఈ ఆఫర్‌ను అందిస్తుండగా, తాజాగా ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లు కూడా ఈ ఆఫర్‌ను ప్రకటించాయి.

ఏం చెబుతున్నాయంటే...
ఈ నెల 12 నుంచి 31 మధ్య ఇప్పటికే చేసుకున్న బుకింగ్స్ కానీ, కొత్త బుకింగ్స్‌ను కానీ రీషెడ్యూల్ చేసుకుంటే ఎటువంటి ఛార్జీలను వసూలు చేయమని ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. అంతేకాకుండా క్యాన్సిలేషన్ ఛార్జీలు కూడా ఉండవని తెలిపింది. ఇక ఎయిర్ ఏషియా కూడా ఈ తేదీల మధ్య జరిగిన బుకింగ్స్ రీషెడ్యూల్స్‌పై ఎటువండి ఛార్జీలు విధించమని ప్రకటించింది. అయితే ఇది కేవలం మొదటి రీషెడ్యూల్‌కి మాత్రమే వరిస్తుందని, అది కూడా షెడ్యూల్ డేట్‌కు 3 రోజుల ముందే రీషెడ్యూల్ చేసుకోవాలని షరతు విధించింది. స్పైస్ జెట్ కూడా 12-31 తేదీల మధ్య ఇప్పటికే జరిగిన బుకింగ్స్‌ను రీషెడ్యూల్ చేసుకుంటే ఎటువంటి ఛార్జీలను విధించమని ప్రకటించింది. ఇక గో ఎయిర్ అయితే మార్చి 8 నుంచి ఏప్రిల్ 30 మధ్య బుక్ అయిన టికెట్స్‌ను రీషెడ్యూల్ చేసుకున్నా, క్యాన్సిల్ చేసుకున్నా ఎటువంటి ఛార్జీలను విధించమని ప్రకటించింది. ఈ రీషెడ్యూల్ తేదీ మార్చి 8 నుంచి సెప్టెంబర్ 30 మధ్యలోనే ఉండాలి. అంతేకాదు, ప్రయాణ తేదీకి 14 రోజులు మందు రీషెడ్యూల్ లేదా క్యాన్సిల్గానీ చేసుకోవాలి, అలా అయితేనే ఆఫర్ వర్తిస్తుంది.

ఎయిర్ ఇండియా ఇలా...
దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కూడా 30 ఏప్రిల్, 2020 లోపు ఇప్పటికే జరిగిన బుకింగ్స్‌ను రీషెడ్యూల్ చేసుకున్నా, లేదా క్యాన్సిల్ చేసుకున్నా ఎటువంటి ఛార్జీని వసూలు చేయమని తాజాగా ప్రకటించింది. అంతేకాకుండా ఈ ఆఫర్ కింద మార్చి 31 లోపు జరిగే కొత్త బుకింగ్స్ కూడా రీషెడ్యూల్ చేసుకోవచ్చు. ఒక బుకింగ్‌కు ఒక రీషెడ్యూల్‌కే ఛార్జీలను వసూల్ చేయరు. రీ షెడ్యూల్ చేసినప్పుడు టిక్కెట్ ధరలో మార్పు ఉంటే మాత్రం అది ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. ‘ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్' కూడా మార్చి 12-31 మధ్య ఇప్పటికే ఉన్న బుకింగ్స్ కానీ, కొత్త బుకింగ్స్‌ను కానీ రీషెడ్యూల్ చేసుకుంటే ఎలాంటి ఛార్జీలు విధించబోమని ప్రకటించింది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications