COVID 19: ఆర్థిక వ్యవస్థకు పదేళ్ల వినాశకర దెబ్బ, రోజుకు ఒక డాలర్ కంటే తక్కువ
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వినాశకరమైన దెబ్బ అని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్‌పాస్ అన్నారు. లక్షలాదిమంది ఈ వైరస్ బారిన పడతారని హెచ్చరించారు. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక పతనం దశాబ్దం పాటు ఉంటుందన్నారు. ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 60 మిలియన్ల మందిని తీవ్ర పేదరికంలోకి నెట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంకు ప్రకారం ఒకరోజుకు ఒక వ్యక్తి 1.90 డాలర్ల కంటే తక్కువతో జీవితం గడుపుతుంటే తీవ్ర పేదరికం.

ఒక డాలర్ కంటే తక్కువ
60 మిలియన్లమందికి పైగా ప్రజలు రోజుకు ఒక డాలర్ కంటే తక్కువ మొత్తంతో జీవితం గడుపుతారని మాల్‌పాస్ తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది వినాశకరమైన లేదా అతి భారీ దెబ్బ అన్నారు. ఆదాయం పడిపోయిందని, అలాగే ఆరోగ్యపరంగాను ఆందోళనకర పరిస్థితులు అన్నారు. ఈ పరిస్థితులను భరించలేనివారు ఎక్కువగా ఇబ్బందిపడ్డారని తెలిపారు.

ఇంకా పని పొందలేకపోతున్నారు
అమెరికా స్టాక్ సహా వివిధ మార్కెట్లు పుంజుకుంటున్నాయని, కానీ పేద దేశంలో ప్రజలు మరింత ఎక్కువగా నిరుద్యోగులుగా మారినట్లు తెలిపారు. అనధికారిక రంగంలో ఏ పనిని పొందలేకపోతున్నారన్నారు. ఈ ప్రభావం ఒక దశాబ్దకాలం ఉంటుందన్నారు. కరోనా వల్ల భారీగా నష్టపోయిన దేశాలకు ప్రపంచ బ్యాంకు, ఇతర సంస్థలతో కలిసి అండగా ఉందని చెప్పారు. అవసరమైతే మరింత చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

రుణ రిలీఫ్
పేద దేశాలకు రుణ రిలీఫ్ కలిగించేందుకు సహకరిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకులు, పెన్షన్ ఫండ్స్ వంటి కమర్షియల్ లెండర్స్ ఆ దేశాల్లోని ఆర్థిక వ్యవస్థకు రిలీఫ్ ఇవ్వాలని సూచించారు. ఆర్థిక వ్యవస్థలను పునర్నిర్మించే లక్ష్యానికి ప్రభుత్వాలు, ప్రయివేటు సంస్థలు తోడ్పాటు కూడా అవసరమన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌తో పాటు కరోనా వల్ల దారుణంగా దెబ్బతిన్న పర్యాటకం వంటి రంగాల్లో ఉద్యోగాలు సృష్టించడానికి పెట్టుబడుల సహకారం అవసరమని చెప్పారు.


Click it and Unblock the Notifications