ఇన్వెస్టర్ బేజారు: కరోనా దెబ్బకు 2గ.ల్లో రూ.11 లక్షల కోట్లు, నెలలో రూ.33 లక్షల కోట్లు ఆవిరి
ముంబై: కరోనా వైరస్, చమురు భయాలతో స్టాక్ మార్కెట్లు విలవిల్లాడాయి. భారీగా పతనమవుతూ బ్యాడ్ రికార్డులు సృష్టించాయి. సెన్సెక్స్ ప్రారంభంలోనే 1700 పాయింట్లు నష్టపోయింది. ఆ తర్వాత ఓ దశలో 2,500 పాయింట్ల వరకు వచ్చింది. సోమవారం కూడా సెన్సెక్స్ భారీ స్థాయిలోనే కుప్పకూలింది. ఉదయం గం.11 సమయానికి మార్కెట్ నష్టాలు ఏకంగా రూ.11 లక్షల కోట్లు దాటింది. ఇదే పరిస్థితి కొనసాగితే ట్రేడింగ్‌ను నిలిపివేసే పరిస్థితులు కూడా ఉంటాయి.
కుప్పకూలుతున్న మార్కెట్లు, మరిన్ని కథనాలు

32 నెలల కనిష్టానికి కంపెనీల మార్కెట్ క్యాప్
గత యాభై రోజులుగా మార్కెట్లు తీవ్రనష్టాల్లోనే ఉంటున్నాయి. భారీగా నష్టపోతూ, స్వల్పంగా లాభపడుతున్నాయి. మొన్న సోమవారం, నేడు గురువారం కనీవినీ ఎరుగని రీతిలో కుప్పకూలాయి. దీంతో ఆయా కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా తగ్గిపోయింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (BSE)లోని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వ్యాల్యూ ఏకంగా 32 నెలల కనిష్టానికి చేరుకుంది.

11 లక్షల కోట్ల సంపద ఆవిరి
మార్కెట్లు ఉదయం గం.9 సమయానికి ప్రారంభమయ్యాయి. ఆరంభం నుండే నష్టాల్లో కొనసాగాయి. సెన్సెక్స్ 1700 పాయింట్ల నష్టం నుండి ప్రారంభమై 2500 సమీపానికి చేరుకుంది. దీంతో ఉదయం గం.11.10 సమయం వరకే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా 11 లక్షల కోట్లు ఆవిరైంది.

తొలి నిమిషంలోనే రూ.6 లక్షల కోట్లు
తొలి నిమిషంలోనే ఇన్వెస్టర్లు రూ.6 లక్షల కోట్లు నష్టపోయారి. గం.11 సమయానికి అది దాదాపు రెండింతలకు చేరుకుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ట్రేడింగ్‌ను కాసేపు నిలిపివేసే పరిస్థితులు ఉంటాయి. అయితే ఆ తర్వాత లాభాల్లోకి రాలేదు కానీ.. నష్టాలు పెరగడం నిలిచిపోయింది.

137 ట్రిలియన్ల నుండి 126 ట్రిలియన్లకు
బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 11 లక్షల కోట్లు (రూ.10.97 ట్రిలియన్లు) ఆవిరై రూ.126.15 ట్రిలియన్లకు తగ్గింది. బుధవారం నాటికి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.137.13 ట్రిలియన్లు. ఇప్పుడు అది రూ.126 ట్రిలియన్లకు పడిపోయింది.

రెండున్నరేళ్ల కనిష్టానికి మార్కెట్ క్యాప్
గత నెల రోజుల్లో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.33.5 ట్రిలియన్లు పడిపోయింది. అంతకుముందు జూన్ 30, 2017లో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.125.95 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పుడు దాదాపు ఆ సమీపానికి చేరుకుంది.


Click it and Unblock the Notifications