వారికి కేంద్రం మరో గుడ్‌న్యూస్, 8 గ్యాస్ సిలిండర్లు ఉచితం
కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుండి మరో శుభవార్త. ప్రజా జీవనం స్తంభించిపోవడంతో కోట్లాది మంది ఉపాది కోల్పోయారు. ఆదాయం నిలిచిపోయింది. ప్రజల చేతుల్లో డబ్బులు లేవు. దీంతో కేంద్రం మూడు నెలల పాటు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. మూడు నెలల పాటు 14.2 కిలోల మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితమని ఇదివరకే ప్రకటించింది. ఇప్పుడు మరో గుడ్ న్యూస్.

వీరికి 3 నెలల్లో 8 సిలిండర్లు ఉచితం
గృహ అవసరాల నిమితతం 5 కిలోల వంట గ్యాస్ సిలిండర్లు ఉపయోగించే వారికి ఈ శుభవార్త. ఈ మూడు నెలల కాలంలో 8 సిలిండర్లను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం (PMUY)కింద 8 కోట్ల మంది లబ్ధిదారులు దీనికి అర్హులు.

గరీబ్ కళ్యాణ్ యోజన
14.2 కిలోల సిలిండర్లు ఉపయోగించే వారికి మూడు నెలల్లో 3 సిలిండర్లు ఉచితం. 5 కిలోల సిలిండర్లను వాడుకునే కుటుంబాలకు ఈ కాలంలో 8 సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వీటిని అందిస్తారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (PMGKY) కింద కేంద్రం రూ.1.70 లక్షల ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే.

రోజుకు లక్షల సిలిండర్లు
లాక్ డౌన్ అమలవుతున్నప్పటి నుండి 50 నుండి 60 లక్షల గ్యాస్ సిలిండర్లు వినియోగదారులకు సరఫరా చేసినట్లు పెట్రోలియం శాఖ అధికారులు తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో గ్యాస్ కొరత లేకుండా చూస్తున్నామని, బుక్ చేసిన 48 గంటల్లో సిలిండర్ డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సమాచారం మేరకు 71 మిలియన్ల ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు రూ.5,606 కోట్లు ట్రాన్సుఫర్ అయ్యాయి.

85 ఉచిత సిలిండర్లు సరఫరా
ఏప్రిల్ నెలలో 1.26 కోట్ల గ్యాస్ సిలిండర్లు బుక్ చేశారు. ఇప్పటికే 85 లక్షల సిలిండర్లు డెలివరీ చేశారు. ప్రభుత్వ డేటా ప్రకారం దేశవ్యాప్తంగా 8 కోట్ల పీఎం ఉజ్వల యోజన లబ్ధిదారులతో పాటు 27.87 కోట్ల ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. ప్రభుత్వరంగ హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ (HPCL), భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (BPCL) కలిపి 85 లక్షల సిలిండర్లు ఉచితంగా సరఫరా చేశాయి.


Click it and Unblock the Notifications