కరోనా మహమ్మారి ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై, వ్యక్తులపై తీవ్రంగా పడింది. మన దేశంలో 45 శాతం మంది ఆర్థిక పునరుద్ధరణపై అనిశ్చితితో ఉన్నారని ఓ సర్వేలో వెల్లడైంది. కనీసం ఒక ఏడాది పాటు వృద్ధి నెమ్మదిస్తుందని, ఇది తమ పర్సనల్ ఫైనాన్స్ పైన ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. డిజిటల్ వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీస్ ప్రొవైడర్ స్క్రిప్‌బాక్స్ జూలై నెలలో ఈ సర్వే చేసింది. ఇందులో 1400 మంది భారతీయుల నుండి వారి ఆర్థిక సంసిద్ధతను, భవిష్యత్తుపై వారి ఆలోచనను అంచనా వేసేందుకుప్రయత్నించింది ఈ సర్వే.

ఈ ఖర్చులు తగ్గించుకుంటాం..
ఈ సర్వేలో పాల్గొన్న 1400 మందిలో 83 శాతం మంది పురుషులు, 17 శాతం మంది మహిళలు ఉన్నారు. స్క్రిప్‌బాక్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సర్వే 2020 ప్రకారం దాదాపు 50 శాతం మంది సాధ్యమైనంత వరకు తమ ఖర్చుల్ని తగ్గించి ఇలాంటి అత్యవసర పరిస్థితుల కోసం ఆదా చేయాలని భావిస్తున్నారు. 28 శాతం మంది అనవసర ఖర్చులు తగ్గించుకుంటామని చెప్పగా, 22 శాతం మంది అత్యవసర సమయంలో అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకుంటామని, 10 శాతం మంది ఈఎంఐ భారాన్ని తగ్గించుకుంటామని తెలిపారు.

పొదుపుగా..
దాదాపు 45 శాతం మంది భారతీయులు అనిశ్చితితో ఉన్నారని ఈ సర్వేలో వెల్లడైంది. ఏడాది పాటు వృద్ధి తక్కువేనని చెప్పారు. అందుకే వ్యక్తిగత ఆర్థిక అంశాలను మార్చివేస్తుందన్నారు. కరోనా కారణంగా కొందరికి ఉద్యోగాలు పోయాయి, మరికొందరి వేతనాలు తగ్గాయి. చేతిలో ఉన్న డబ్బులను పొదుపుగా ఉపయోగించుకునేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 44 శాతం మంది తమ నెలవారీ ఆదాయంలో 15 శాతం నుండి 30 శాతం, 11 శాతం మంది సగం ఈఎంఐల కోసమే ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. దీనిని తగ్గించుకుంటామని 10 శాతం మంది చెప్పారు.

అవసరమైతే బయటివారి సాయం
పిల్లల చదువులు, ఇంటి కొనుగోలు ప్రాధాన్యతను కేవలం 10 శాతం మంది మాత్రమే మొగ్గుచూపారు. కరోనాకు ముందు ఇష్టారీతిన ఖర్చు చేసిన వారు కూడా ఇప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారని, పెట్టుబడుల ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. అత్యవసర ఖర్చులు, రిటైర్మెంట్ తర్వాత అవసరాల కోసం పెట్టుబడుల ప్రణాళికకు మొగ్గు చూపుతున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో సగం మంది ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం అవసరమైతే బయటి వారి సాయం తీసుకుంటామని తెలిపారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications