కరోనా మహమ్మారి కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం జరిగిందని ఎస్బీఐ పరిశోధనా సంస్థ ఎకొరాప్ తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థకు ఇప్పటి వరకు రూ.30.3 లక్షల కోట్ల నష్టం జరిగిందని పేర్కొంది, ఇది మొత్తం జీడీపీలో 13.5 శాతానికి సమానం అని వెల్లడించింది. దేశంలో ఐదు పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) నష్టం 50 శాతానికి సమీపంలో ఉందని తెలిపింది. ఈ ఐదు రాష్ట్రాల నష్టమే దాదాపు రూ.11 లక్షల కోట్లు అని పేర్కొంది.

కేంద్రం ప్యాకేజీ కంటే భారీ నష్టం
భారీగా నష్టాలు చవిచూసిన తొలి మూడు రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ ఉన్నట్లు తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఢిల్లీ వంటి టాప్ టెన్ రాష్ట్రాల జీఎస్‌డీపీ నష్టం దాదాపు 75% వరకు ఉందని ఎస్బీఐ నివేదిక తెలిపింది. మొత్తం నష్టంలో ఆరెంజ్, రెడ్ జోన్ల వాటా 90% ఉందని అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ కంటే ఈ నష్టం దాదాపు 50 శాతం ఎక్కువ అని వెల్లడించింది. ప్రతి రాష్ట్రంలో జోన్ వారీగా, జిల్లాల వారీగా అంచనా వేసినట్లు తెలిపింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో మైనస్ 6.8 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు ఏకంగా మైనస్ 6.8 శాతంగా ఉండవచ్చునని ఎస్బీఐ అంచనా వేసింది. 2020 మార్చితో ముగిసిన త్రైమాసికంలో భారత వృద్ధి రేటు 1.2 శాతానికి పడిపోనుందని ఎస్బీఐ ఎకోరప్ తన నివేదికలో అంచనా వేసింది. 2019-20లో వృద్ధి 4.2 శాతానికి పరిమితమయ్యే అవకాశముందని తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడు క్వార్టర్‌లలో 5.1 శాతం, 5.6 శాతం, 4.7 శాతంగా నమోదయింది.

మార్చి ఏడు రోజుల్లో ఎంత నష్టమంటే
మార్చి 25వ తేదీ నుండి లాక్ డౌన్ కొనసాగుతోంది. మార్చి నెలలో ఏడు రోజులు ఈ లాక్ డౌన్ ఉంది. ఈ వారం రోజుల్లోనే ఏకంగా రూ.1.4 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా. దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతోన్న విషయం తెలిసిందే. మర్కజ్ ఘటన వెలుగు చూసిన తర్వాత కేసులు ఎక్కువగా పెరిగాయి. ఇండియాలో ఇప్పటి వరకు 150,793 కేసులు ఉన్నాయి. 4,344 మరణాలు చోటు చేసుకున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications