రాగిని ఇప్పుడే కొనిపెట్టుకోండి.. భవిష్యత్తులో చేతికి చిక్కదంటున్న గోల్డ్‌మన్ సాక్స్..

Copper Prices: అంతర్జాతీయ మార్కెట్లో పసిడి, ఇంధన ధరలు భగ్గుమంటున్న వేళ, ప్రముఖ పారిశ్రామిక లోహమైన రాగి (Copper) కూడా అదే దారిలో పయనించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా రాగి సరఫరా వ్యవస్థ తీవ్రమైన దీర్ఘకాలిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, త్వరలోనే రాగి ధరలు బంగారం ధరల మాదిరిగా విపరీతంగా పెరిగే అవకాశముందని అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ 'గోల్డ్‌మన్ సాక్స్ రీసెర్చ్' తన తాజా నివేదికలో హెచ్చరించింది.

కొత్త గనుల అన్వేషణ మందగించడం, తవ్వే కొద్దీ ఖనిజ నాణ్యత (Ore Grade) క్షీణించడం, ప్రాజెక్టుల అభివృద్ధి వ్యయాలు తారాస్థాయికి చేరడం వల్ల రాగి ఉత్పత్తి రంగం తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటోంది. సాంప్రదాయకంగా ఒక రాగి గనిని కనుగొన్నప్పటి నుండి అక్కడ పూర్తిస్థాయి తవ్వకాలు ప్రారంభమై మొదటి ఉత్పత్తి బయటకు రావడానికి పట్టే సగటు సమయం ఇప్పుడు ఏకంగా 16 సంవత్సరాలకు పైగా పెరిగిందని గోల్డ్‌మన్ సాక్స్ వెల్లడించింది.

Copper Prices Today Copper Price Outlook 2026 Goldman Sachs Copper Forecast Copper Supply Crunch Global Copper Shortage Copper Mining New Copper Mines 16 Years Copper Demand 2030 Copper Market News Copper Price Prediction Copper Supply Deficit Industrial Metal Prices Copper Mining Stocks Copper Investment Copper News Telugu Global Commodity Market

రాగి సరఫరాలో ఏర్పడుతున్న ఈ కొరత కేవలం తాత్కాలిక లేదా చక్రీయమైనది కాదని.. ఇది ఒక దీర్ఘకాలిక నిర్మాణాత్మక లోపమని ఈ నివేదిక స్పష్టం చేసింది. 1990ల నాటి నుండి ప్రపంచవ్యాప్తంగా పెద్ద రాగి నిక్షేపాల ఆవిష్కరణలు గణనీయంగా తగ్గిపోయాయి. ముఖ్యంగా దక్షిణ అమెరికాలోని ప్రధాన గనుల్లో ఖనిజ గ్రేడ్ విపరీతంగా క్షీణించడంతో పాటు, కొత్త ప్రాజెక్టులు అత్యంత మారుమూల ప్రాంతాలలో ప్రారంభించాల్సి వస్తోంది. ఫలితంగా గనుల నిర్మాణం, నిర్వహణ మరియు మూలధన వ్యయాలు (Capex) విపరీతంగా పెరుగుతున్నాయి.

Also Read

ఒక ప్రాజెక్టు ప్రారంభ మూల్యాంకనం నుండి ఉత్పత్తి మొదలయ్యే వరకు.. ప్రతి టన్ను ఉత్పత్తి సామర్థ్యానికి అయ్యే మూలధన వ్యయం సుమారు 50 శాతం వరకు పెరగవచ్చని గోల్డ్‌మన్ సాక్స్ అంచనా వేసింది. ప్రతి టన్ను ఉత్పత్తికి అయ్యే వ్యయం $10,600 డాలర్ల నుండి $15,900 డాలర్లకు పెరిగే అవకాశముంది. కంపెనీలు సొంతంగా వేసుకునే అంచనాల కంటే వాస్తవ నిర్మాణ వ్యయాలు 25% నుండి 90% వరకు ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. 2030 నాటికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న గనుల నుండి ఉత్పత్తి క్రమంగా తగ్గుముఖం పట్టనుంది.

మరోవైపు గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ రంగానికి రాగి అత్యంత కీలకమైన ముడిసరుకుగా మారింది. ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు (సోలార్, విండ్), ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ గ్రిడ్‌ల నిర్మాణం కోసం రాగికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. డిమాండ్ ఊహించని రీతిలో పెరుగుతున్నప్పటికీ.. నేటి అధిక రాగి ధరలు కూడా రాబోయే రెండు దశాబ్దాలలో కొత్త లోహం లభ్యతను తక్షణమే పెంచలేవు. నేడు తీసుకునే పెట్టుబడి నిర్ణయాల ప్రభావం కేవలం 2040లలో మాత్రమే సరఫరా రూపంలో ప్రతిబింబిస్తుంది.

రాగి సరఫరా కొరత సుదీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశం ఉండటంతో.. ఇప్పటికే స్వంత గనులను నిర్వహిస్తున్న బడా మైనింగ్ కంపెనీలు లేదా ఉత్పత్తిని విస్తరించుకోగల స్థితిలో ఉన్న సంస్థలకు భారీ లబ్ధి చేకూరనుంది. బిహెచ్‌పి (BHP), ఫ్రీపోర్ట్-మెక్‌మోరాన్, ఆంటోఫాగస్టా, భారత్‌లోని హిందాల్కో (Hindalco) వంటి కంపెనీల ఆస్తుల విలువ గణనీయంగా పెరగనుంది. 2035 చివరి నాటికి రాగి విస్తరణ ప్రాజెక్టుల ద్వారా ఏటా 10 లక్షల టన్నుల అదనపు ఉత్పత్తి సామర్థ్యం తోడవుతుందని, ఈ ఆస్తుల నికర విలువలో సుమారు $20 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.70 లక్షల కోట్లు) సంభావ్య పెరుగుదల నమోదవుతుందని గోల్డ్‌మన్ సాక్స్ అంచనా వేసింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+