రాగి చేతికి చిక్కదంటున్న ప్రపంచ బ్యాంకు.. కాపర్ ధరలు రికార్డు స్థాయిలో పెరగబోతున్నాయని అంచనా..

Copper Prices: అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లు, పారిశ్రామిక లోహాల ధరల భవిష్యత్ గమనంపై ప్రపంచ బ్యాంకు (World Bank) తమ తాజా 'కమోడిటీ మార్కెట్స్ ఆౌట్‌లుక్' నివేదికలో అత్యంత కీలకమైన అంచనాలను వెలువరించింది. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ నెట్‌వర్క్‌ల విస్తరణ, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత డేటా సెంటర్ల నిర్మాణం గణనీయంగా పెరిగింది. ఈ పరిణామాల వల్ల రాగి, తగరం (Tin), జింక్ (Zinc) వంటి పారిశ్రామిక లోహాలకు డిమాండ్ విపరీతంగా పెరగనుందని, రాబోయే రోజుల్లో ఇవి రికార్డు స్థాయిలకు పుంజుకుంటాయని ప్రపంచ బ్యాంకు నివేదించింది.

రాగి, తగరం, జింక్ ధరల భారీ సవరణ: ప్రపంచ బ్యాంకు విశ్లేషణ ప్రకారం, కొత్త గనుల వెలికితీత మందగించడం, సరఫరా వ్యవస్థలో అడ్డంకులు ఏర్పడటంతో రాగి ఉత్పత్తి పెరిగే డిమాండ్‌ను అందుకోవడంలో తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది.

Copper Price Forecast 2027 Copper Price World Bank Commodity Outlook Copper Price Target Gold Price Forecast Gold Price 2027 Copper Demand Copper Supply Shortage Electric Vehicles Data Centres Renewable Energy Industrial Metals 2027 2027

రాగి (Copper): ఏప్రిల్ నెలలోని అంచనాల కంటే 18% సవరించి, 2027 నాటికి సగటు రాగి ధర టన్నుకు $13,000 డాలర్లకు (పౌండ్‌కు దాదాపు $5.90 డాలర్లు) చేరుకోవచ్చని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. కాగా 2026 నాటికే సగటున టన్నుకు $13,200 తాకే అవకాశం ఉంద ని తెలిపింది.

తగరం (Tin): గ్లోబల్ టెక్ ఇండస్ట్రీలో విరివిగా ఉపయోగించే తగరం సగటు ధర 2027 నాటికి ఏప్రిల్ అంచనా కంటే 22% పెరిగి టన్నుకు $45,000 డాలర్లకు చేరవచ్చని అంచనా వేసింది.

జింక్ (Zinc): పారిశ్రామిక అవసరాల వల్ల జింక్ ధరల అంచనాను 13% పెంచి టన్నుకు $3,100 డాలర్లుగా నిర్ధారించింది.

పసిడి (బంగారం) ధరలపై భిన్నమైన వైఖరి: పారిశ్రామిక లోహాల ధరలు కొత్త గరిష్టాలను నమోదు చేస్తున్నప్పటికీ, బంగారం విషయంలో ప్రపంచ బ్యాంకు వైఖరి భిన్నంగా ఉంది. సురక్షిత పెట్టుబడిగా 2026లో బంగారం సగటు ధర ఔన్సుకు $4,600 డాలర్ల వద్ద రికార్డు గరిష్టాన్ని తాకిన తర్వాత.. 2027 నాటికి సరఫరా పుంజుకుని సగటు ధర ఔన్సుకు $4,250 డాలర్లకు పడిపోతుందని అంచనా వేసింది. ఇది ప్రస్తుత సంవత్సరం నాటి అంచనాల కంటే దాదాపు 7.6% తక్కువ కావడం గమనార్హం.

చమురు మంటలు, ఆర్థిక వృద్ధికి ముప్పు: పశ్చిమాసియా యుద్ధ ఘర్షణలు, సముద్ర వాణిజ్య మార్గాల్లో అవాంతరాల వల్ల 2026లో గ్లోబల్ కమోడిటీ ధరల సూచీ ఏకంగా 23% పెరిగే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. బ్రెంట్ ముడి చమురు సగటు ధర 2026లో బ్యారెల్‌కు $91కు చేరుతుందని.. పరిణామాలు తీవ్రమైతే $105 దాటవచ్చని స్పష్టం చేసింది. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల పెరిగే ఇంధన ధరలు ద్రవ్యోల్బణాన్ని మళ్లీ పెంచి, నిత్యావసర రవాణా, ఆహార ధాన్యాల ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారవచ్చని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+